BJP Senior leaders unsatisfy with CM Yediyurappa పార్టీ అధినాయకత్వ నిర్ణయానికి కట్టుబడి వుంటా: యడ్యూరప్ప

What so ever will abide to high command decision cm yediyurappa

BJP central leadership, BS Yediyurappa, BJP High Command, Party Senior Leaders, MLA, Nalin, Jagadish Shettar, Delhi, Karnataka, Politics

The BJP central leadership has rejected any idea to change the chief minister of Karnataka for now, despite attempts by some state leaders. BS Yediyurappa had said that he was willing to quit as CM if the party leadership directs him. Yediyurappa was also planning to visit Delhi to meet the central leaders.

పార్టీ అధినాయకత్వ నిర్ణయానికి కట్టుబడి వుంటా: యడ్యూరప్ప

Posted: 06/09/2021 05:17 PM IST
What so ever will abide to high command decision cm yediyurappa

కర్ణాటకలో అధికార బీజేపిలో ప్రభుత్వ పగ్గాలు మార్పు అనివార్యమయ్యేలా వున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ముఖ్యమంత్రిని మార్చాలంటూ బీజేపి జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీజేపి అధినాయకత్వం కూడా పార్టీని కాపాడుకునే పనిలో భాగంగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అసంతృప్తిపై దృష్టిసారించి అభిప్రాయ సేకరణకు నడుంబిగించినట్టు సమాచారం. పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ముఖ్యమంత్రిపై అభిప్రాయ సేకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే వీరు బీజేపిలోని ఎమ్మెల్యేలను ఒక్కక్కిరగా పిలుస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారని, వీరి సేకరణ పూర్తైన తరువాత.. వారు జాతీయ నాయకత్వానికి ఒక నివేదిక సమర్పంచనున్నారని తెలుస్తోంది. దీంతోనే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. నిజానికి బీజేపీలో సంతకాల సేకరణ అనే సంప్రదాయం లేదు. అయితే, ముఖ్యమంత్రి యడ్డీకి వ్యతిరేకంగా కొందరు సంతకాల సేకరణ చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, యడియూరప్ప మద్దతుదారులు 65 మంది తమ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని కనుక నిర్వహిస్తే తమ అభిప్రాయాన్ని చెబుతామని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అది కూడా అధిష్ఠానం నుంచి వచ్చే నేత సమక్షంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ చీఫ్ విప్ సునీల్ కుమార్ కూడా సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ ట్వీట్ చేయడం యడ్డీపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని చెబుతున్నారు.  కాగా, పార్టీ బాధ్యుడు అరుణ్ సింగ్ త్వరలోనే బెంగళూరు వచ్చి తాజా పరిణామాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles