Tea Vendor Sends Rs 100 To PM Modi గడ్డం గీసుకోమ్మని ప్రధానికి రూ.100 పంపిన చాయ్ వాలా..

Tea vendor sends rs 100 to pm modi to get his beard shaved

PM Narendra Modi, COVID-19 lockdown, Anil More , PM Modi beard, Rs 100 beard shaving,

A tea vendor from Baramati in Maharashtra has sent a money order of Rs 100 to Prime Minister Narendra Modi asking the latter to get his beard shaved. In the last one and a half years, the unorganised sector has been hit hard because of the covid-induced lockdown.

గడ్డం గీసుకోమ్మని ప్రధానికి రూ.100 పంపిన చాయ్ వాలా..

Posted: 06/09/2021 06:19 PM IST
Tea vendor sends rs 100 to pm modi to get his beard shaved

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహారాష్ట్రకు చెందిన చాయ్ వాలా వంద రూపాయలను పంపించాడు. అదేంటి ప్రధానికి ఆయన ఎందుకు వంద రూపాయలు పంచించారంటే.. గత ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్రమోడీ గడ్డం పెంచుతూ పోతున్నారని, ఆయన గడ్డం చేసుకునేందుకు గాను తాను వంద రూపాయలను పంపుతున్నానని తెలుపుతూ ఓ సందేశాన్ని కూడా పంపారు. అదేంటి దేశ ప్రధానిని అవమానించేందుకే ఆయన ఇలా చేశారన్న ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిస్తూ ప్రధాని పదవి అంటే దేశంలో అత్యున్నత పదవని దానిని అవమానించడం తన ఉద్దేశ్యం కాదని చెప్పారు.

ఇకపై ప్రధాని దేశవ్యాప్తంగా ఏదైనా పెంచాలనుకుంటే అని భావిస్తే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలంటూ మహారాష్ట్రకు చెందిన ఓ టీస్టాల్ యజమాని మోదీకి లేఖ రాస్తూ తన నిరసనను వ్యక్తం చేశాడు. దేశంలోని ఉపాధి అవకాశాలను పెంచాలని ఆయన పేర్కోన్నారు. కరోనా నేపథ్యంలో విధిస్తున్న లాక్ డౌన్ కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన పేరు అనిల్ మోరే. బారామతిలోని ఇందాపూర్ రోడ్డులో గల ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు.

ప్రధాని మోదీ గడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య  సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని అనిల్ మోరే కోరాడు. ప్రతీ మారుమూల గ్రామంలో వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్ డౌన్‌ ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్న మోరే.. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు.

మోదీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని పేర్కొన్నాడు. మహమ్మారి కారణంగా దేశ ప్రజలు, పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు మోరే వివరించాడు. దేశవ్యాప్తంగా కోవిడ్ తో కుటుంబసభ్యులను కోల్పోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించాలని, కోవిడ్ కారణంగా ఆర్థికంగా చతికిలపడ్డ చిరువ్యాపారులకు రూ.30 వేల రూపాయలను అందించాలని అనీల్ మోరే కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  COVID-19 lockdown  Anil More  PM Modi beard  Rs 100 beard shaving  

Other Articles