Anandaiah medicine to be delivered online: Kakani కరోనా రోగులకు మాత్రమే ఆనందయ్య మందు: కాకాని

Anandaiah s ayurveda medicine distributed online only kakani govardhan reddy

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, kakani govardhan reddy, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

The Ruling YSRCP MLA Kakani Govardhan Reddy appeals people of telugu states not to come to SPS Nellore district for Ayurvedic practitioner B Anandaiah traditional medicine, touted as a miracle cure particularly for Covid-19 patients, after the Andhra Pradesh government gave nod on Monday.

కరోనా రోగులకు మాత్రమే ఆనందయ్య మందు: కాకాని గోవర్థన్ రెడ్డి

Posted: 06/02/2021 11:48 AM IST
Anandaiah s ayurveda medicine distributed online only kakani govardhan reddy

కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషదానికి ఎట్టకేలకు అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో ఔషద తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా మందును అందిస్తున్న ఆనందయ్య ఔషదం మళ్లీ కరోనా బారిన పడిన రోగులకు అందనుంది. గత వారం పది రోజులుగా ఆయన మందు అందకపోవడంతో హైరానా పడిన కరోనా బాధితులకు ఇకపై ఊరట లభించనుంది. అయితే గతంలో మూడు నాలుగు వరుసల క్రమంలో మందును పంఫిణీ చేయడం లేదని ఆనందయ్య చెప్పిన విషయం తెలిసిందే.

ఇకపై ఔషదం కోసం ఎవరూ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నానికి రాకూడదని చెప్పిన ఆయన ఔషదాన్ని కావాలనుకునే కరోనా రోగులకు తాము ఆన్ లైన్ ద్వారా పంఫిణీ చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన సమావేశానంతరం మాట్లాడుతూ.. ఇకపై ఆన్ లైన్ విధానంలో తాను మందు పంపిణీ చేయనున్నానని, దాంతో పాటు పోస్టల్, కొరియల్ సేవల ద్వారా కూడా మందును పంఫిణీ చేస్తామని చెప్పారు. బాధితులు, రోగుల బంధువులు ఇకపై ప్రజలు కృష్ణపట్నం రావొద్దని అభ్యర్థించారు,  

కాగా ఆనందయ్య ఔషదాన్ని తొలుత కరోనా సోకిన రోగులకు మాత్రమే అందజేయనున్నామని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు. కరోనా సోకి బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించేడమే తమ ప్రధమ కర్తవ్యంగా చెప్పుకోచ్చారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ఆనందయ్య నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలెవరూ కృష్ణపట్నం రావొద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇక తరువాతి క్రమంలో కరోనా రాకుండా ముందును కూడా ప్రజలకు మందును అందజేయనున్నట్లు తెలిపారు. అన్ లైన్ సహా పోస్టల్, కోరియర్ సర్వీసుల ద్వారా కూడా మందు పంఫిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని కాకానీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles