A Teen Shoves A Bear To Save Her Family's Dogs ఎలుగుబంటి దాడి నుంచి తన కుక్కపిల్లలను కాపాడిన బాలిక

Teen saves dogs from bear atop california fence in viral tiktok video

Bradbury, California, California teen, Girl shoves bear off wall, Hailey Morinico, Teen saves dogs from bear, Teen shoves bear attacking dogs, Teen shoves bear in backyard, Video of girl shoving bear off wall, US Teen, bear, pet dogs, confrontation, bradbury, california, United States, viral video, video viral, Crime

A CCTV footage captured the incredible moment a teenage girl shoved a bear that was swatting at her family’s dogs in their backyard on Memorial Day. Hailey Morinico, 17, spotted the mother bear with her two cubs after she heard her dogs barking in her backyard in Bradbury, California.

ITEMVIDEOS: ఎలుగుబంటి దాడి నుంచి తన కుక్కపిల్లలను కాపాడిన బాలిక

Posted: 06/02/2021 10:59 AM IST
Teen saves dogs from bear atop california fence in viral tiktok video

కొందరు పెంపుడు కుక్కలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటికేమైనా ఆపద వాటిల్లుతుంటే తట్టుకోలేరు. ఈ అమెరికా టీనేజి అమ్మాయి కూడా అంతే. తన ఇంట్లో ప్రవేశించిన ఓ పెద్ద ఎలుగుబంటి తన కుక్కపిల్లలపై దాడికి యత్నిస్తుంటే, సివంగిలా ముందుకు దూకింది. తన కుక్కపిల్లలను ఎలుగుబంటి నుంచి కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అభయారణ్యంలోని వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చేస్తుంటే.. వాటి నుంచి తమను తాము కాపాడుకోవడమే గగనంగా మారుతుండగా, తమ ప్రేమించే పెంపుడు జీవులను కాపాడుకోవడం మరింత కష్టంగా మారుతుంది.

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని బ్రాడ్ బురి ప్రాంతంలో నివసిస్తున్న 17 ఏళ్ల హెయిలీ మోరినికో చేసిన సాహసం నెటిజన్లను అబ్బురపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెపైను శివంగి అని ప్రశంసిస్తూ కామెంట్లు వరద ఉప్పోంగుతోంది. హెయిలీ మోరినికో చేసిన సాహసం కూడా అనితర సాధ్యమైనదే. అయితే ఏమాత్రం ఎలుగుబంటికి పట్టు దొరికి వున్నా పరిస్థితి మరోలా వుండేది. అసలు జరిగిందేమిటంటే.. హెయిలీ తన ఇంట్లో ఉన్న సమయంలో ఎలుగుబంటి ఆమె ఇంటి పెరటి గోడ ఎక్కింది. దీన్ని చూసి కుక్కలన్నీ దానివెంటపడ్డాయి. ఎలుగుబంటి ఎంతో బలమైనది కావడంతో ఆ కుక్కలపై దాడికి దిగింది.

ప్రమాదాన్ని గ్రహించిన హెయిలీ రాకెట్లా దూసుకువచ్చి, గోడపై ఉన్న ఎలుగుబంటిని తన చేతులతోనే నెట్టివేసింది. దాన్ని గోడపై నుంచి బలంగా నెట్టివేయడంతో ఆ ఎలుగు అవతలికి పడిపోయింది. ఇదే అదనుగా హెయిలీ తన పెంపుడు కుక్కను చేతుల్లోకి తీసుకుని అక్కడ్నించి వచ్చేసింది. మొత్తానికి ఓ సూపర్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకుంది. పట్టతప్పిన ఎలుగుబంటి అప్పటికే తన పిల్లలు భయపడి వెళ్లిపోవడంతో వాటిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. అలా కాకుండా తిరగబడి వుంటూ హెయిలీ ప్రమాదానికి గురయ్యేది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teen  Hailey Morinico  bear  pet dogs  confrontation  bradbury  california  United States  viral video  video viral  Crime  

Other Articles