police gives roses to violaters before siezing vehicles రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పోలీసుల రోజులు.. ఆ తరువాత..

Bengaluru police gives roses to lockdown violaters before siezing vehicles

Corona virus, Covid norms, Basavaraj Bommai, COVID 19, lockdown, Covid vaccines black-marketing, violators, vehicles sieze, police roses to motorists, airport Road, HunasamaranaHalli Gate, Commercial establishments, Bengaluru, Karnataka

The police seized vehicles after giving roses to motorists violating lockdown rules, besides appealing to them not to come out on roads unnecessarily. Bengaluru police also booked 63 cases against the owners of shops and commercial establishments for operating during lockdown.

రోడ్లపైకి వచ్చే వాహనదారులకు పోలీసుల రోజులు.. ఆ తరువాత..

Posted: 05/26/2021 07:31 PM IST
Bengaluru police gives roses to lockdown violaters before siezing vehicles

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ దేశవ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. కర్ణాటకపై తన పంజాను విసరడంతో తొలి విడత మొదలు మొన్నటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర కేసుల వ్యాప్తిని గణనీయంగా నియంత్రించింది. అదే సమయంలో కర్ణాటకలో మాత్రం కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు యావత్ దేశంలోనే అత్యధిక కేసులు నమోదు చేసుకున్న రాష్ట్రంగా నమోదయ్యింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ విధించింది. అయితే కొందరు మాత్రం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వీరికి ఫైన్లు వేస్తున్నారు. కొంతమంది పోలీసులు కొత్త కొత్త శిక్షలు వేస్తున్నారు.

అయినా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో మార్పు రావడం లేదు. వీపులపై లాఠీలు నృత్యం చేస్తున్నాయి. బిస్కీలు తీయించడం, గుంజీలు తీయడం వంటివి చేయిస్తున్నారు. ఇటీవలే.. బెంగళూరు శివారు ప్రాంతానికి చెందిన పోలీసులు..వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారికి పూలు, హారతి, అక్షింతలు వేస్తున్నారు. తాజాగా..బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగే వారికి దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. బ్యారికేడ్లు అమర్చడం, తనిఖీలు చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారి ఎదుట పోలీసులు ప్రత్యక్ష్యమవుతున్నారు. బయటకు వచ్చేందుక కారణాలను తెలుసుకున్న తరువాత అకారణంగా బయటకు వచ్చినట్టు తెలిస్తేవారికి గులాబీ పువ్వు అందించి బైక్ దిగమంటారు.

అనంతరం ఆ బైక్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. గులాబీ పువ్వు మీకు..బైక్ మాకు ..అంటూ చెప్పేస్తున్నారు. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంది. ఈ సమయంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిత్యావసర సరుకులు, ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు.సమయం అయిపోయినా..రద్దీ తగ్గడం లేదు. ఏదో ఒక కారణాలు చెబుతూ..వెళుతున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 31,515 వాహనాలను జప్తు చేసి రూ.3.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇక లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించి అక్రమంగా వ్యాపారాలను నిర్వహిస్తుస్న 63 కమర్షియల్ కాంపెక్సులపై కూడా కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles