hand sanitizer ignite major car fire in Maryland క్షణాల్లో కారును దగ్ధం చేసిన హ్యాండ్ శానిటైజర్.!

Car bursts into flames when smoking driver uses hand sanitizer

Rockville Pike car fire, cigarette, hand sanitizer, parking area, shoping mall, major car fire, Rockville, Montgomery County, Fire spokesperson Pete Piringer, driver escape, minor burns, Maryland, United States, America, crime

Firefighters are warning the public not to mix lit cigarettes with alcohol-based hand sanitizer, after that combination ignited a dramatic vehicle fire in the parking lot of a shopping mall in Rockville, Md.

క్షణాల్లో కారును దగ్ధం చేసిన హ్యాండ్ శానిటైజర్.!

Posted: 05/17/2021 08:14 PM IST
Car bursts into flames when smoking driver uses hand sanitizer

కరోనావైరస్ మహమ్మారి తొలిదశ, రెండోవ దశ పలు దేశాల్లో మూడవ దశ కూడా విజృంభించడానికి సిద్దంగా వుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కరోనా తమ దరి చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు కరోనా టీకాలను వేయించుకుంటున్నా.. హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్ లను మాత్రం తప్పక వినియోగిస్తన్నారు. దీనికి తోడు సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ.. అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. ఇక ఇళ్లను వదిలి షాపింగ్ మాల్, లేదా మార్కెట్ లేదా ఇతర పనులపై బయటకు వెళ్లిన క్రమంలోనూ అని్న జాగ్రత్తలను పాటిస్తున్నారు.

అయితే, చాలా మంది హ్యాండ్ శానిటైజర్స్ ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇక బయట ఏదైనా తినేందుకు, తాగేందుకు ముందు కూడా హ్యాండ్ శానిటైజర్ ను వినియోగిస్తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు కొందరు ప్రమాదాల బారిన కూడా పడతున్నారు. శానిటైజర్ రాసుకుని సిగరేట్ వెలిగించిన పలువురు కాలిన గాయాలకు కూడా గురయ్యారు. ఇలాంటి చర్యలకు పౌరులు దూరంగా వుండాలని శానిటైజర్ మరీ ముఖ్యంగా లిక్కర్ తో కూడిన శానిటైజర్ వినియోగించిన తరువాత నిప్పుకు దూరంగా వుండాలని అటు ప్రభుత్వాలు, ఇటు ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా.. ఓ వ్యక్తి శానిటైజర్ అధికంగా చేతులకు రాసుకుని తన కారునే దగ్ధం అయ్యేందుకు కారణమయ్యాడు. అదెలా అంటే తన కుటుంబంతో కలసి రాక్ విల్లీ నగరంలోని మాంట్గోమెరీ కౌంటీలోని షాపింగ్ మాల్ కు వెళ్లాడు. తన కుటుంబసభ్యులు షాపింగ్ మాల్ లోకి షాపింగ్ చేయడానికి వెళ్లగా, తాను మాత్రం తన కారులోనే సిగరెట్ తాగేందుకు పార్కింగ్ ఏరియాలోనే ఉండిపోయాడు. అయితే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా తన చేతులు శానిటైజ్ చేసుకుందామని వెంటనే లిక్కర్ తో చేసిన శానిటైజర్ ను తన చేతులకు రాసుకున్నాడు. అదే సమయంలో సిగరెట్ నిప్పురవ్వలు తన చొక్కపై పడ్డాయి. దీంతో తనకు ఎక్కడ గాయం అవుతోందనని ఆత్రుతగా వాటిని చేత్తో పక్కకు నెట్టే క్రమంలో తన చేతులు సీటుపై పడి.. వెంటనే నిప్పు అంటుకుని క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది.  

ఈ ఘటన అమెరికాలోని మేరిల్యాండ్‌లో చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను అర్పివేశాయి. అయితే అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. మంట్గోమెరీ కౌంటీకి చెందిన అగ్నమాపకదళ అధికార ప్రతినిధి పిటీ పిరింగర్ ఈ ఘటనపై స్పందిస్తూ అధిక మోతాదులో హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం..అదే సమయంలో అతను సిగరెట్ తాగడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. శానిటైజర్ రాసుకున్న సమయంలో మరీ ముఖ్యంగా లిక్కర్ తో కూడిన శానిటైజర్ రాసుకున్న తరుణంలో ప్రజలు నిప్పుకు దూరంగా వుండాలని లేని పక్షంలో ఇలా ప్రమాదాలు జరుగుతాయని అన్నాడు.అగ్నికి ఆహుతవుతున్న కారు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cigarette  hand sanitizer  parking area  shoping mall  major car fire  Rockville  Maryland  United States  America  crime  

Other Articles