Mucormycosis Cases are increasing in Telugu states తెలుగు రాష్ట్రాల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ మరణాలు..

Health officials worry as mucormycosis cases are increasing in ap telangana

Black Fungus, Mucormycosis, Andhra Pradesh, Telangana, Khammam, Nirmal, Adilabad, Hyderabad, Guntur, Kurnool, diabetic, fungal infection, Oxygen, Ventilator, India Covid crisis, India Covid news, Coronavirus news, Coronavirus latest news, Coronavirus, coronavirus second wave, covid-19, covid deaths in India

Mucormycosis, which is a rare fungal infection, being seen across India in Covid-19 Patients make Telugu states, Telangana and Andhra Pradesh Health officials worried as there is surge in cases. Three from AP and Two from Telangana had been fatal due to this Mucormycosis.

తెలుగు రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ టెన్షన్.. క్రమేనా పెరుగుతున్న కేసులు

Posted: 05/17/2021 07:34 PM IST
Health officials worry as mucormycosis cases are increasing in ap telangana

కోవిడ్ రోగులతో పాటు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారినపడిన వారిని తాజాగా బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు ఉత్పన్నమయ్యాయి. అయితే షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో వుండేలా పర్యవేక్షిస్తే.. బ్లాక్ పంగస్ రాదని ఎయిమ్స్ డైరెర్టర్ రణదీప్ గులేరియా తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన బ్లాక్ పంగస్ బాధితులందరిలో సుమారు 90 శాతం మంది మదుమేహ వ్యాధిగ్రస్తులేనని ఆయన తెలిపారు. ఈ తరుణంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

కాగా ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ బ్లాక్ ఫంగస్ మెల్లిగా కోరాలు చాస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిపై తన పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నమోదవుతున్న కేసులు తెలుగు రాష్ట్రా వైద్యవిభాగం అధికారులలో టెన్షన్ రేకెత్తిస్తున్నాయి. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ బారిన పడినవారు ప్రాణాలను కోల్పోతున్న క్రమంలో అటు అధికారులు, ఇటు రోగుల బంధవుల్లో అందోళన రేకెత్తుతోంది. తెలంగాణలో అటు అదిలాబాద్, ఇటు హైదరాబాద్ లలో బ్లాక్ పంగస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో దీని బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏపీలోనూ ముగ్గురు బ్లాక్ పంగస్ కు బలయ్యారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను తప్పించే క్రమంలో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వినియోగించడమే.. బ్లాక్ పంగస్ కు కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.

గుజరాత్‌ లో తొలుత కనిపించిన బ్లాక్‌ ఫంగస్ ఆతర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తాజాగా తెలంగాణ, ఏపీలో కూడా పాకింది. ఏపీలో బ్లాక్ ఫంగస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడితో పాటు మరో యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, నిర్మల్ జిల్లాలలో బ్లాక్ ఫంగస్ మరణాలు సంభవించాయి. తెలంగాణ‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులను కోఠి ఈ.ఎన్.టీ ఆస్పత్రి నోడ‌ల్ కేంద్రం నుంచి వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కంటి సమస్య ఉన్నవారికి సరోజనీదేవి కంటి ఆస్పత్రి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles