AP High Court rejects Raghurama Krishnnam Raju bail ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

Andhra pradesh high court rejects raghurama krishnnam raju bail petition

Raghu Rama Krishna Raju, Narsapur MP, Bail Petition, AP High Court, AdiNarayana Rao, AP sessions court, member of parliament Narsapur, Hate Speeches, PV Sunil Kumar, Additonal DG CID, Conspiracy, media channels, AP CID, CM YS Jagan, YSRCP, CRPF Security, Andhra pradesh, CRIME

YSRCP MP Raghurama Krishnam Raju has received a jolt from Andhra Pradesh High Court. The High Court has rejected the bail petition Court made it clear that it could not interfere in the arrest. It advised the petitioner to move the lower court for bail and sated that it could not intervene in the case under the present circumstances.

ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ

Posted: 05/15/2021 07:21 PM IST
Andhra pradesh high court rejects raghurama krishnnam raju bail petition

రాష్ట్రప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపర్చేలా వ్యవహరించారన్న అభియోగాలపై అరెస్టైయని నర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. తనకు అక్రమంగా రాష్ట్రానికి చెందిన పోలీసులు అరెస్టు చేశారని పేర్కోన్న రాఘురామ కృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిష‌న్ ను న్యాయస్థానం కోట్టివేసింది. బెయిల్ పిటీషన్ పై విచారణ రాష్ట్రోన్న‌త న్యాయ‌స్థానం వాద‌న‌లు పూర్తి అవ‌డంతో.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని ర‌ఘురామ‌కు సూచించింది. రాఘురామ కృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌ను ఆదేశించింది.

నర్సాపురం ఎంపీ అరెస్టు కేసులో నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన న్యాయస్తానం.. బెయిల్ కోసం సెషన్స్ (కింది) కోర్టుకు వెళ్లాల‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాదులు ఆయన బెయిల్ కోసం సెషన్స్ కోర్టు తలుపుతట్టే అవకాశాలు వున్నాయి, ఎంపీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ప్రాథ‌మిక విచార‌ణ లేకుండా ఎంపీని అరెస్టు చేయడం సమంజసం కాదన్న ఆయన అరెస్టుకు స‌హేతుక కార‌ణాలు లేవ‌న్నారు. దీంతో రఘురామ కృష్ణ రాజును సీఐడీ అదికారులు సంబంధిత సిఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు వున్నాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అద‌న‌పు కోర్టులో ర‌ఘురామ‌ను హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles