Couple Sells 3-Month- Boy to buy Car సెకండ్ హ్యాండ్ కారు కోసం కన్నబిడ్డ అమ్మకం.!

Up couple sells newborn baby for rs 1 5 lakh to buy a second hand car

Grandparents, Parents, New Born Baby, Baby Boy, Child, Second Hand Car, Shailendra Kumar Mishra, sold newborn, fir, couple sold newborn, couple sold newborn for a car, baby, car, couple, Kannauj, Newborn Baby, Tirwa Kotwali police station, UP, Crime

In a shameful incident, a couple in Uttar Pradesh's Kannauj allegedly sold their newborn baby to purchase a second-hand car. According to a report by The Times of India, the couple sold their 3-month-baby boy to a businessman for Rs 1.5 lakh.

వీళ్లూ తల్లిదండ్రులేనా.? సెకండ్ హ్యాండ్ కారు కోసం కన్నబిడ్డ అమ్మకం.!

Posted: 05/15/2021 11:36 PM IST
Up couple sells newborn baby for rs 1 5 lakh to buy a second hand car

అడ్డదారులు తొక్కైనా తన కుటుంబాన్ని, భార్య పిల్లల సంతోషం కోసమే అని ఇంటి యజమానులు భావిస్తుంటారు. కుటుంబపోషణ భారంగా మారడంతోనే తాను వక్రమార్గంలోనైనా వారిని పోషించాలని ప్రయత్నించారు చాలా మంది. కానీ మారుతున్న కాలంతో పాటు తండ్రుల అలోచనా విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. తన భార్య, పిల్లలు అన్న అలోచనను పక్కన బెట్టేసిన వ్యక్తి తన జల్సాలకు మాత్రమే ప్రాధన్యత ఇస్తున్నాడు. అందుకోసం అవసరమైతే తన కన్న బిడ్డలను తానే ఇతరుకు బేరం పెట్టేసి.. దాంతో తన కోరికలను తీర్చుకుంటున్నారు. నిజానికి కన్న తల్లిదండ్రులు ఇంతటి నీచానికి దిగజారుతారా.? అన్న అనుమానాలు కలగక మానవు.

కానీ అదే జరిగింది. లగ్జరీ జీవితానికి అలవాటు పడిన ఓ జంట తమ బిడ్డను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో ఓ కారును కోనుగోలు చేసింది. అమ్మమ్మ, తాతయ్యల పిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వీరి నిర్వాకం తెలిసిన వారు వారి ముఖన్ని కూడా చూడటానికి ఇష్టపడటం లేదు.. ఇక వీరి కనిపించగానే ఛీ కొడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లా తిర్వా కోత్వాలి పోలిస్ స్టేషన్ పరిధిలో నివాసం వుంటుందన్న దంపతులకు మూడు నెలల క్రితం మగ బిడ్డ సంతానం కలిగింది. కొన్ని రోజులు బాబుతో సంతోషంగా గడిపిన ఈ జంట మనస్సులో దుర్భుద్ది చేరింది.

సెకండ్ హ్యండ్ కారు కోనాలని వారు ముచ్చటపడ్డారు. అయితే అందుకు డబ్బు ఇచ్చి వున్నా లేక ఈఎంఐ రూపంలో తీసుకన్నా బాగానే వుండేది. కానీ ఈ జంట అందుకు భిన్నంగా వ్యవహరించారు, తమ వద్ద అంత డబ్బు లేకున్నా తమ కోరికను మాత్రం తీర్చుకోవాలని అనుకున్నారు. దీంతో తమ బిడ్డను అమ్మేయాలని భావించారు. మూడు నెలల పసికందును ఓ వ్యాపార వేత్తకు లక్షన్నర రూపాయలకు అమ్మేశారు. కానీ శిశువు కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానాం కలిగింది. బిడ్డ తల్లిదండ్రులే ఏదో చేసివుంటారన్న సందేహం వారిలో కలిగింది. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో తమ స్టైయిల్ లో పోలీసులు వారిని విచారించే సరికి నిజాలు నిగ్గుతేలాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles