Bandi Sanjay brings special oxygen cyclinders to Telangana బండి సంజయ్ మంత్రాంగం.. ప్రత్యేక విమానంలో ఆక్సిజన్

Bandi sanjay brings special oxygen cyclinders to telangana after meet with central leaders

Bandi Sanjay, BJP, Telangana CM, KCR, Health Minister, Eetala Rajender, Oxygen Cyclinders, covid medicine, remidicevir, covifor, New Delhi, Union Ministers, Telangana, Politics

The State President of BJP Bandi Sanjay Kumar today bought special oxygen cyclinders to telangana after the telangana health minister made sensational remarks against the Central Governmnt that it is not issuing oxygen cylinders and essential covid medicine to the state.

బిగ్ బ్రేకింగ్: ఫలించిన బండి సంజయ్ మంత్రాంగం.. ప్రత్యేక విమానంలో ఆక్సిజన్

Posted: 04/23/2021 12:48 PM IST
Bandi sanjay brings special oxygen cyclinders to telangana after meet with central leaders

(Image source from: Thehansindia.com)

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ద్వితీయ పర్యాయ విజృంభన కొనసాగుతున్న తరుణంలో.. ప్రజల అజాగ్రత్త, నిర్లక్ష్యపు చర్యలు ఉదృతిని మరింతగా పుంజుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపి అద్యక్షుడు కేంద్రంతో నెరిపిన మంత్రాంగం పనిచేసింది. తెలంగాణలో కరోనా విజృంజనను.. సెకెండ్ వేవ్ ఉద్దృతిని కేంద్రానికి అర్థం చేయించడంలో విజయం సాధించిన ఆయన కేంద్రం నుంచి ప్రత్యేక కోటాను రాష్ట్రానికి తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు అందకపోవడం.. కరోనా చికిత్సలో వినియోగించే రెమీడిసివీర్ వంటి ఔషదాలు అందుబాటులో లేకపోవడంతో.. అనేక మంది రోగులు అసువులు బాస్తున్నారు.

ఈ సమస్యపై కేంద్రానికి వివరించడంలో.. కేంద్రమంత్రులకు దృష్టికి సమస్య తీవ్రతను తీసుకురావడంలో బండి సంజయ్ విజయం సాధించారు. కేంద్రం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కరోనా చికిత్సకు అవసనమైన ఔషదాలను తీసుకువస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన రోగులకు ఉపశమనం లభించే అవకాశాలు వున్నాయి. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు హస్తినకు వెళ్లి అక్కడి కేంద్రమంత్రులు, బీజేపి పెద్దలకు తెలంగాణలో నెలకొన్న దారుణ పరిస్థితులను వివరించి.. రాష్ట్రానికి అవసరమైన సరంజామాను సమకూర్చడంలో విజయం సాధించారు.  

తమ రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కరోనా చికిత్సకు అత్యవసరమైన ఔషదాలను అందించడంలో వివక్ష చూపుతోందని.. ఇలాంటి వివక్షతో రాజకీయ లాభం పోందాలనుకోవడం అవివేకమని తెలంగాణ వైద్యఅరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా ఆయన ధ్వజమెత్తిన 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి మంత్రాంగం నెరపి రాష్ట్రానికి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడంలో సఫలీకృతుడయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles