Fire accident at Telangana Bhavan విజయసంబరాల్లో అపశృతి: తెలంగాణ భవన్ లో అగ్నిప్రమాదం..

Surabhi vani devi victory celebrations fire accident at telangana bhavan

fire accident at telangana bhavan, surabhi vani devi victory celebrations misfire, fire galloped in telangana bhavan, Surabhi VaniDevi, TRS MLC victory, Victory celebrations, crackers, fire accident, Telangana Bhavan, Fire Tenders, Hyderbad, crime

In a shocking incident, a major fire broke out at Telangana Bhavan during the victory celebrations of TRS contestant Surabhi Vani Devi in graduate MLC elections. The video of the fire accident at Telangana Bhavan is doing rounds on the internet and creating panic among the followers.

ITEMVIDEOS: విజయసంబరాల్లో అపశృతి: తెలంగాణ భవన్ లో అగ్నిప్రమాదం..

Posted: 03/20/2021 06:15 PM IST
Surabhi vani devi victory celebrations fire accident at telangana bhavan

తెలంగాణ అధికార పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం అగ్నిప్రమాదానికి దారితీసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. విజయోత్సవ ఏర్పాట్ల కోసం పార్టీ శ్రేణులు సిద్దమయ్యారు. నాలుగో రోజు కౌంటింగ్ లో సాయంత్రం సురభి వాణీదేవి గెలిచిందన్న వార్త వారిలో కొత్త జోష్ ను నింపింది. తెలంగాణ భవన్ ఆవరణలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్ నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణిదేవీ గెలుపొందడంతో శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చడం, స్వీట్లు పంచడం చేపట్టారు. అయితే కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి భవనం ఆవరణలో వేసిన చలవ పందిళ్లపై పడ్డాయి. దీంతో ఉదయం నుంచి ఎండ వేడిమికి తట్టుకుని చలవ పంచిన పందిళ్లపైకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో మంటలు అంటుకోవడం మంటలు ఒక్క ఉదుటున లేవడం స్థానికంగా కలకలం రేపింది.

చలవపందిళ్లను పెద్ద ఎత్తున మంటలు రావడంతో వెంటనే కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. చలువ పందిళ్ల కింద నుంచి కార్యకర్తలను పక్కకు జరిపారు. కొందరు కార్యాలయ సిబ్బంది రెండో అంతస్తు నుంచి నీళ్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. అయితే సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్లు కూడా హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చి మంటలను అర్పాయి. ఈ సమయంలో అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంటలు ఆరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles