Pakistan PM Imran Khan tests positive for COVID-19 టీకా తీసుకున్నా.. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా ఎలా సోకిందబ్బా.?

Imran khan tests positive for covid 2 days after getting vaccinated

Imran Khan, Pakistan, pm imran khan, covid-19, Coronavirus vaccination, Coronavirus, Sinopharm, Covid-19 Vaccine, CanSinoBio, Oxford-AstraZeneca, Sputnik V vaccines, Pakistan

Pakistan Prime minister Imran Khan on Saturday tested positive for the COVID-19 and is self-isolating at home, his top aide on health Dr Faisal Sultan said, two days after he got the first shot of vaccination.

టీకా తీసుకున్నా.. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా ఎలా సోకిందబ్బా.?

Posted: 03/20/2021 05:27 PM IST
Imran khan tests positive for covid 2 days after getting vaccinated

మహమ్మారి కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ప్రపంచదేశాలతో పాటు పాకిస్తాన్ లోనూ కోరలు చాస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్  తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనను పరీక్షీంచిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేల్చారు. అదెలా సాధ్యం.. కరోనా టీకా తీసుకున్న వ్యక్తులు కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వుంటుంది కదా.? మరి ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు కదా.? మరి ఆయనకు కరోనా ఎలా సోకింది. ఆయన కరోనా బారిన పటడానికి కారణలేంటి.? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.

పాకిస్థాన్ ప్రధానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన తీసుకున్న కరోనా టీకా గురించి ఆరా తీస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయన ఏ వాక్సీన్ తీసుకున్నారన్న విషయం తెలిస్తే తాము ఆ వాక్సీన్ కు దూరంగా వుండవచ్చునన్న యోచనలో ఇప్పుడు యావత్ ప్రపంచం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్‌ రావడం విస్మయం కలిగిస్తున్నా.. ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయంపై కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ అంశం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని పాక్‌ వైద్య శాఖ మంత్రి ఫైజల్‌ సుల్తాన్‌ ప్రకటించారు.

ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్‌ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్‌ రేపడం ఆందోళన కలిగిస్తోంది.  అయితే చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ‘సినోవక్‌’ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్‌ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్‌ ప్రధానికి పాజిటివ్‌ రావడం.. చైనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్‌ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్‌ కూడా నాసిరకం అని కామెంట్స్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles