This Chief Minister has assets worth Rs 54 lakh only ఈ సీఎం ఆస్తి అంతాకలిసి రూ.54 లక్షలే..

Kerala cm pinarayi vijayan declares assets worth rs 54 lakh two houses no vehicle

Pinarayi vijayan assets, Pinarayi vijayan affidavit, Kerala assembly elections, LDF, UDF, Congress, CPI(M), CPIM, Pinarayi Vijayan, Ramesh Chennithala, Oommen Chandy, Rahul Gandhi, Shashi Tharoor, Gold smuggling scam, Sabarimala, Love jihad, Metroman E Sreedharan, K Surendran, Kerala Assembly election 2021, Assembly election in Kerala, Kerala election result May 2, Meena, Pinarayi government, Leader of Opposition Chennithala, Pinarayi vijayan salary, Pinarayi vijayan wealth

Kerala Chief Minister Pinarayi Vijayan on Monday filed his nomination for the upcoming Assembly polls, to contest from Dharmadam constituency in Kannur district. Pinarayi Vijayan has declared his total assets to be worth Rs 54 lakh, with his income for the financial year 2020-21 to be Rs 2.87 lakh.

ఈ సీఎం ఆస్తి అంతాకలిసి రూ.54 లక్షలే.. ఆయన భార్యకు రూ.65 లక్షలే..

Posted: 03/16/2021 07:35 PM IST
Kerala cm pinarayi vijayan declares assets worth rs 54 lakh two houses no vehicle

ప్రకృతి సొంత రాష్ట్రంగా బాసిల్లుతున్న.. నూరుశాతం అక్షరాస్యతతో పరఢవిల్లుతున్న రాష్ట్రంగా కేరళ దేశంలోనే చక్కటి గుర్తింపును పోందింది. ఈ రాష్ట్రంలో మరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఎలా వుంటాయన్న సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేరళ ఓటర్లను తనదైన శైలిలో అకర్షించేందుకు పలు పర్యాయాలు పర్యటనలు చేశారు. తన సుడిగాలి పర్యటనలతో పాటు మేధావులతో సమావేశాలలోనూ పాల్గోన్నారు. ఇక ఇటు వామపక్షాలు కూడా తమ అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్దం చేశాయి. ఇక చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన గోల్డ్ స్కామ్ ఒక్కటి ఎల్డీఎఫ్ కూటమికి శరాఘాతంలా తయారైంది.

అసెంబ్లీ ఎన్నికల గెలిచేందుకు ఇప్పటికే పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక తమ తమ నియోజకవర్గాలలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సీపీఐ (ఎం) అభ్యర్థిగా కన్నూరు జిల్లా ధర్మాడం నుంచి బరిలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన నామినేషన్ పత్రాలను మంగళవారం నాడు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన ఎన్నికల నామినేషన్ లో తన ఆస్తుల వివరాలను పోందుపర్చుతూ అఫిడవిట్ కూడా సమర్పించారు. అయితే ఈ అఫిడవిట్ చూసిన మీడియా కూడా విస్మయం చెందింది.

ఎందుకంటే ఆయన పేరున కనీసం కోటి రూపాయల ఆస్తులు కూడా లేవు. సొంత వాహనాలు లేవు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన ఆయన తన పేరును కేవలం అరకోటికి పైగా మాత్రమే అస్తులు వున్నాయని అంతకుమించి లేవని అఫిడవిట్ లో పేర్కోన్నారు. అయితే ఆయన సతీమణి కమలా విజయన్ పేరున అంతకు కోద్దిగా ఎక్కువగా ఆస్తులు వున్నాయే తప్ప.. అమె పేరున కూడా కోటి రూపాయలకు మించిన ఆస్తులు లేకపోవడం గమనార్హం. కమలా విజయన్ పేరు మొత్తంగా రూ. 60 లక్షల మేర మాత్రమే ఆస్తులు కలిగివున్నారు. వీరిద్దరి పేరున ఉన్న ఆస్తులను జతపర్చగా మొత్తంగా కోటి పది లక్షలు మాత్రమే.  

పినరయి ఆస్తులన్నీ కలిపితే కేవలం రూ.54 లక్షలు మాత్రమే ఉన్నాయి. 2020 21లో ఆయన వార్షిక ఆదాయం రూ.2.87 లక్షలుగా పేర్కొన్నారు. రెండు సొంత ఇళ్లు ఉన్నాయని, సొంత వాహనం లేదని ప్రకటించారు. పినరయి పేరిట రూ.51.95 లక్షల విలువైన స్థిరాస్తులు, 2.04 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పొందుపరిచారు. అయితే తన భార్య పేరిట రూ.35 లక్షల విలువైన స్థిరాస్తులు, రూ.29.7లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారని ఈ సందర్భంగా అఫిడవిట్‌లో పినరయి స్పష్టంగా రాయించారు. అయితే వీరిద్దరికీ అప్పులు ఏమీ లేకపోవడం విశేషం. భార్య పేరిట రూ.3.3 లక్షలు విలువ చేసే 80 గ్రాముల బంగారం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles