Tirupati and Sagar by-polls on April 17 సాగర్, తిరుపతి ఉపఎన్నికలకు మ్రోగిన నగారా.!

Tirupati lok sabha nagarjunasagar assembly by polls on april 17

Election Commission, Nagarjuna Sagar By Election, Tirupati Bypolls, Nagarjuna sagar assembly constituency, Tirupati Parliamentary constituency, BelgaumParliamentary constituency, Karnataka, Andhra Pradesh, Telangana, 14 Assembly by polls, Gujarat by poll, Jharkhand by poll, Madhya Pradesh by poll, Maharashtra by poll, Mizoram by poll, Nagaland by poll, Odisha by poll, Rajasthan by polls, Uttarakhand by poll, Politics

The Election Commission of India has announced the by-election schedule for Tirupati Parliament seat and Nagarjunasagar Assembly seat. Both the constituencies will go for polling on April 17th.

నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నికలకు మ్రోగిన నగారా.!

Posted: 03/16/2021 06:26 PM IST
Tirupati lok sabha nagarjunasagar assembly by polls on april 17

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి.. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్థానాలకు ఏప్రిల్ 17న ఎన్నికల నిర్వహించేందకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఇవాళ తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా వున్న అన్ని స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2 పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఏపీలోని తిరుపతి లోక్ సభతో పాటు కర్ణాటకలోని బల్గామ్ లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గత ఏడాది సెప్టెంబర్ మాసంలో కరోనాతో పోరాడుతూ మరణించారు. ఇక కర్ణాటకలోని బెల్గామ్ పార్లమెంటరీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించిన కేంద్రమంత్రి సురేష్ అంగాడి కూడా గత సెప్టెంబర్ నెలలోనే కోవిడ్ బారిన పడి మరణించారు. ఈ పార్లమెంటరీ స్థానంలో నుంచి ఆయన గతంలో నాలుగు పర్యాయాలు విజయం సాధించారు. రైల్వే సహాయ మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కోవిడ్ బారిన పడి మరణించారు.

ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే తెలంగాణలోని నాగార్జున సాగర్‌ శాసనసభ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా మరో 13 స్థానాలకు  ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఏప్రిల్ 17న ఎన్నికలు నిర్వహంచనున్నారు. ఇక మిగిలిన స్థానాలు గుజరాత్ లోని - మోర్వా హడాఫ్ (ఎస్టీ), జార్ఖండ్ - మధుపూర్, కర్ణాటక - బసవకళ్యాణ్, కర్ణాటక - మాస్కి (ఎస్టీ), మధ్యప్రదేశ్ - దామోహ్,  మహారాష్ట్ర - పంధర్పూర్, మిజోరాం - సెర్చిప్ (ఎస్టీ), నాగాలాండ్ - నోక్సేన్ (ఎస్టీ), ఒడిశా -పిపిలి, రాజస్థాన్ - సహారా,  రాజస్థాన్ -సుజన్‌గఢ్ (ఎస్సీ), రాజస్థాన్ -రాజ్ సమండ్,  ఉత్తరాఖండ్ - సాల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.

దీనికి సంబంధించి ఈనెల 23 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్‌ 17న తిరుపతి, నాగార్జున సాగర్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు ఈసీ గడువు విధించింది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువుగా నిర్ణయించింది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles