Konda Vishweshwar Reddy to distance himself from Politics కాంగ్రెస్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్.. 3 నెలలు దూరంగా..

Former mp konda vishweshwar reddy to distance himself from the congress

Konda Vishweshwar Reddy distance congress, Richest Politician, 2019 Lok Sabha Elections, 2024 Parliament Elections, TRS, lok sabha, Konda Vishweshwar Reddy, Government, Congress, Chevella, Telangana, Politics

Former MP Konda Vishweshwar Reddy, the second richest among the candidates who contested 2019 Lok Sabha elections in the country has decided to distance himself from the Congress by taking a three-month break.

కాంగ్రెస్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్.. 3 నెలలు దూరంగా..

Posted: 03/15/2021 05:31 PM IST
Former mp konda vishweshwar reddy to distance himself from the congress

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం బలం చేకూర్చేలా వుంది. రెండు రోజుల ముందువరకు సాగిన హైదరాబాద్-మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. తీరా అదివారం జరిగిన ఎన్నికలలో ఓటు హక్కును కూడా వినియోగించుకన్న ఆయన ఆ తరువాతి రోజునే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మూడు నెలల పాటు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. బీజేపిలో చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు. 3నెలల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అయినా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపిలో చేరతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు చేవెళ్ల టిక్కెట్ లభించడంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి లేఖ రాశారు.

స్వతహాగా సంపన్నుడు, విద్యావేత్త, పారిశ్రామిక వేత్త అయిన విశ్వేశ్వర్ రెడ్డి 2014లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయనను తమ పార్టీలోకి అహ్వానించిన టీఆర్ఎస్.. పార్టీ నుంచి చేవెళ్ల తరపున పార్లమెంటు బరిలోకి దింపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయంసాధించారు. ఆ తరువాత ఆయన అనూహ్యంగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  lok sabha  Konda Vishweshwar Reddy  Government  Congress  Chevella  Telangana  Politics  

Other Articles