No Need For CBI Probe in Double Murder Case: HC జంటహత్యల కేసులో సీబిఐ విచారణ అవసరం లేదన్న హైకోర్టు

Advocate couple murder case no need for cbi probe says telangana high court

PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

The Telangana High Court on Monday stated that there was no need for the Central Bureau of Investigation (CBI) probe into the murders of the lawyer couple in Telangana’s Peddapalli district, as the investigation was court monitored, which was directly overseeing the investigation process. A petition was filed in the High Court seeking handing over the investigation of the Vaman Rao couple murder case to the CBI.

న్యాయవాదుల హత్యకేసు: సీబిఐ విచారణ అవసరం లేదన్న హైకోర్టు

Posted: 03/15/2021 04:42 PM IST
Advocate couple murder case no need for cbi probe says telangana high court

తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్యకేసులో రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణపై రాష్ట్రోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో మరో్ జాతీయ దర్యాప్తు సంస్థ సీబిఐ చేత విచారణ జరిపించాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ స్పష్టం చేసింది. పెద్దపల్లి ఘటనలో నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను హతమార్చిన కేసు విచారణను స్వయంగా హైకోర్టు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో సీబిఐ చేత విచారించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కోంది.

న్యాయవాదులు వామన్ రావు, నాగమణి దంపతులను అత్యంత పాశవికంగా.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై అగంతకులు కిరాతకంగా హత్య చేశారని,.. ఈ కేసులో తెరవెనుక అసులు పెద్దలు ఎందరో వున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ.. వారందిరి పేర్లు బయటకు రావాలంటే సిబీఐ చేత విచారణ జరిపించడమే మార్గమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వామన్ ర‌వు దంపతుల హత్య కేసుపై సీబీఐచే విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చిన ఆయన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.

ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకుందని.. రాష్ట్రప్రభుత్వానికి ఈ ఘటనపై సమగ్ర నిదేవిక ఇవ్వాల్సిందిగా కూడా అదేశించిందని న్యాయస్థానం పేర్కోంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సరైన దిశలోనే సాగుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణలో న్యాయస్థానం డీజీపీకి కూడా నోటీసులను జారీ చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరిపుతోందని పేర్కోంది. ఇప్పుడు సీబిఐ విచారణకు అదేశిస్తే మళ్లీ సమయం వృధ్దా అవుతుందని న్యాయస్థానం తెలిపింది.

ఈ సందర్భంగా తమ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న విషయమై పోలీసులు న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.  కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసిన‌ట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, సిసిటీవీ, మొబైల్ విజువల్స్ ఎఫ్ఎస్ఎల్‌కి పంపించాం అన్నారు. అలాగే మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామ‌న్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన ఫోన్లను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కు కోర్టు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lawyer Couple  High Court  Gattu Vaman Rao  PV Nagamani  Telangana  crime  

Other Articles