devotees throng to Shiva Temples in Telugu states శివరాత్రి రోజున అరుదైన శ్వేతనాగు దర్శనం

Devotees throng to shiva temples in telugu states on shiva ratri

white serpent Maha Shivaratri, White Cobra manchiryala, white cobra court premises, white serpent Laxittipet Municipality, Manchiryala district, Pasupulati Santosh, colony people worshiped white serpent, Telangana

On the occasion of Maha Shivaratri a rare speicies of White cobra appeared in the court premises of Laxittipet Municipality in Manchiryala district, near Pasupulati Santosh House. The colony people worshiped the white serpent in large numbers and poured milk on it.

శివరాత్రి రోజున అరుదైన శ్వేతనాగు.. దర్శనం

Posted: 03/11/2021 01:02 PM IST
Devotees throng to shiva temples in telugu states on shiva ratri

శివరాత్రిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వున్న హింధూ భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు వెళ్లి అదిదేవుడి దర్శనాన్ని చేసుకుంటూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే ఈ అత్యంత పవిత్రమైన రోజున ఏం జరిగినా అది శివయ్య ఆజ్ఞ మేరకే జరిగిందని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. శివరాత్రి పర్వదినం రోజున భక్తులు అత్యంత భక్తివిశ్వాసాలతో శివయ్యను స్మరిస్తూ.. వేడుకలు చేసుకుంటున్న తరుణంలో జిల్లాలోని లక్సీట్టిపేట్ మున్సిపాలిటీలో శివయ్య హారాభరణమైన నాగుపాము దర్శనమిచ్చింది.

అందికూడా అత్యంత అరుదుగా కనిపించే శ్వేత నాగు దర్శనమిచ్చింది. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు అవరణలో గల పసుపులేటి సంతోష్ ఇంటి ఆవరణలో ఈ అరుదైన శ్వేతనాగు దర్శనమిచ్చింది. దీంతో ఇది శివయ్య ఆజ్ఞ మేరకు తమను దర్శనమివ్వ వచ్చిందని.. శ్వేతనాగుకు కాలనీవాసులు పెద్దసంఖ్యలో పూజలు చేసశారు. పాములకు పాలు పోసి భక్తితో ప్రార్థన చేశారు. మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ ‌క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో.. ‌శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles