Milk Price May Go Up By Rs 12 From March మార్చి 1 నుంచి లీటరు పాలపై రూ.12 పెంపు..?

After petrol onion prices leave consumers in tears milk price may go up by rs 12 from march

Milk Price May Go Up By Rs 12, milk price hike, milk price to hike by Rs 12, Milk producers meet, petrol prices, onion prices, milk prices, price rise, india, diesel prices, fuel prices, milk Price, milk price hike, milk price march,transportation cost, milk expensive, indian economy, business

In wake of the increase in petrol and diesel prices, LPG cylinders and vegetables, milk producers held a meeting in Ratlam, Madhya Pradesh. During the meeting, it was decided to hike the milk price to Rs 55 per litre from March 1. Milk producers blame the increase in transportation costs due to hike in petrol and diesel prices. They said animal feed has also become expensive.

పాల వంతు.. మార్చి 1 నుంచి లీటరుపై రూ.12 పెంపు..

Posted: 02/25/2021 09:29 PM IST
After petrol onion prices leave consumers in tears milk price may go up by rs 12 from march

కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శతకం మార్కుకు అత్యంత చేరువలో వున్నాయి. అదే సమయంలో వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే ఒక్కసారిగా భారీ కుదుపునిచ్చి.. పేదల పాలిట గుదిబండగా మారిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ మరోమారు రూ.25 మేర పెరిగింది.

వీటి ప్రభావంతో అటు నిత్యావసర సరుకుల ధరలకు కూడా రెక్కలు వచ్చేశాయి. ఇక ఇటు కూరగాయల ధరలతో బెంబేలెత్తిపోతున్నాయి. ఇదే తరుణంలో మరో పిడుగులాంటి వార్త సామాన్యుడి తలపై మరో పిడుగు పడేలా చేసింది. అదేటి అంటారా.. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా వినియోగించే పాలుకు కూడా రెక్కలు రానున్నాయి. ఔనండీ ఇక ఇప్పుడు పాల ధరలు పెంచాలని మధ్యప్రదేశ్‌ రత్లాంలోని పాల ఉత్పత్తిదారులు నిర్ణయించారు. ఇదివరకు ఎన్నడూ లేనంతగా మార్చి1 నుంచి లీటర్‌ పాల ధరపై రూ.12ల చొప్పున పెంచాలని నిర్ణయించారు.

దీనిపై పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు హీరాలాల్‌ చౌదరి స్పిందిస్తూ.. ఇంధన ధరల ప్రభావం తమ పాడిపరిశ్రమపై చాలా అధికంగా పడిందిని.. దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు వచ్చాయని.. పాల ధరల పెంపుకు ఇంధన ధరలే కారణమని చెప్పుకోచ్చారు. ఈ క్రమంలో స్థానిక 25 గ్రామాలకు చెందిన పాల ఉత్పత్తిదారులం సమావేశమై.. పాల ధరలను పెంచాలని మేం డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. గతేడాది కూడా రూ.2లు పెంచాలని నిర్ణయించినా.. నగరంలోని సరఫరాదారులతో అంగీకారం కుదరకపోవడం.. దీనికితోడు కరోనా సంక్షోభం రావడంతో పెంచలేదని తెలిపారు.

ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌లకు తోడుగా పశు దాణా ధరలు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పాల ధర రత్లాంలో రూ.43గా ఉంది. దాన్ని రూ.55లకు పెంచాలని నిర్ణయించాం. దీనిపై నగరంలోని పాల విక్రయదారులతో చర్చలు జరుపుతాం’’ అని వివరించారు. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టగా.. ఉల్లిధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో సామాన్యుడి బతుకు బండి భారంగా మారుతోంది. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతిఒక్కరూ తీసుకొనే పాల ధరలు పెరిగితే సామాన్యుడి జీవనం మరింత భారం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles