PNB scam: Nirav Modi to be extradited to India, rules London Court నిరవ్ మోడీని భారత్ కు అప్పగించండీ: లండన్ కోర్టు

Punjab national bank scam case nirav modi to be extradited to india rules london court

Nirav Modi, Nirav Modi news, Nirav Modi latest news, Nirav Modi extradition, Nirav Modi extradition India, Punjab National Bank, PNB scam, Judge Samuel Goozee, Westminster Magistrates’ Court, UK court, PNB scam Nirav Modi

In a major blow to fugitive businessman Nirav Modi, a UK court on Thursday ordered his extradition to India after a nearly two-year-long legal battle. The court accepted the Indian case that Nirav Modi threatened witnesses and tampered with evidence.

నిరవ్ మోడీకి షాక్.. భారత్ కు అప్పగించండీ: లండన్ కోర్టు అదేశాలు..

Posted: 02/25/2021 08:47 PM IST
Punjab national bank scam case nirav modi to be extradited to india rules london court

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా భారత్ కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్‌ మోడీ చేసిన ప్రయత్నాలన్నింటికీ అక్కడి వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం అడ్డుపుల్ల వేసింది. నిధుల మళ్లింపు అభియోగాలు రుజువైన నేపథ్యంలో అతనికి శిక్ష ఖరారు అవుతుందని, ఈ నేపథ్యంలో ఆయనను భారత దేశానికి అప్పగించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి సామ్యూల్‌ గూజీ అదేశించారు.

భారత్ లో తనకు న్యాయం జరగదని ఆయన ఇన్నాళ్లు చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్‌ చేసిన వాదనలను కోర్టు తప్పబట్టింది. భారత్ కు అప్పగించినంత మాత్రన అన్యాయం జరగదని న్యాయస్థానం పేర్కొంది. నిధుల మళ్లింపు విషయంలో భారత్‌ సమర్పించిన ఆధారాల రుజవు అయ్యాయని, ఈ ఆధారాలు ఆయనకు శిక్ష ఖరారు చేసేందుకు కూడా సరిపోతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఆయనను తన దేశానికి అప్పగించాలని తీర్పు వెలువరించింది.

కాగా నిరవ్ మోడీకి చివరకు ఒక చిన్న ఆశను కల్పించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో నీరవ్‌ మోడీ మరికొన్ని రోజుల పాటు భారత్ కు రాకుండా అక్కడి ఉన్నత న్యాయస్థానాల్లో అపీలు చేసుకునే వెసలుబాటు లభించింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిరవ్ మోడీ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

తప్పుడు ఎల్‌వోయూలతో పీఎన్‌బీని నీరవ్‌ మోసగించిన వైనం 2018 జనవరి వెలుగుచూడగా.. సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. అదే ఏడాది ఈడీ సైతం రంగంలోకి దిగి నీరవ్‌కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles