Raidurgam Police Arrested Koilamma Actor Aamir చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో..

Raidurgam police arrested koilamma serial star aamir

Sameer, koilamma serial hero arrest, koilamma serial hero charlapalli jail, sameer arrest, amar shashank arrest, amar shashank, koilamma telugu TV serial, Koilamma serial Hero, charlapalli jail, kukatpally court, rayadurgam police, cyberabad police, Hyderabad, crime

Rayadurg Police arrested Koilamma serial hero, Aamir today. Many cases have been registered against him. Cops arrested him in a case related to a fight between him and an owner of botique. A few days ago, he and his girl friend entered into an altercation with two women who have been running a botique.

చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో అమర్ శశాంక్..

Posted: 02/10/2021 02:28 PM IST
Raidurgam police arrested koilamma serial star aamir

కోయిలమ్మ సీరియల్‌ హీరో అమర్ అలియాస్ సమీర్ ను న్యాయస్థానం అదేశాలపై చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మణికొండ పరిధిలో ఒంటరిగా వుంటున్న ఇద్దరు మహిళల ఇంటికి రాత్రి పూట వెళ్లి వారిపై దౌర్జన్యానికి పాల్పడి.. గట్టిగా కేకలు వేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేసిన కేసులో సమీర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టైయిన సమీర్ ను పోలీసులు కూకట్ పల్లి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సమీర్ అకస్మాత్తుగా అగ్రహావేశాలకు గురయ్యాడు. ఒక స్నేహితురాలి తరపున వకాల్తా పుచ్చుకుని మరో ఇద్దరిపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. కాగా ఈ గొడవ సందర్భంగా అక్కడికి వచ్చిన ఇరుగుపోరుగు వారు ఈ తతంగాన్నంతా తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో వాటినే సాక్షాలుగా చూపుతూ బోటిక్ లో మరో ఇద్దరు మహిళలు సమీర్ పై రాయదుర్గం పోలీస్‌ స్టేషనులో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వివరాల ప్రకారం.. శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతోఇటీవల స్వాతి తన భాయ్ ఫ్రెండ్‌ కోయిలమ్మ సీరియల్ నటుడు సమర్ తో కలిసి వారింటికి వెళ్లి గొడవపడ్డారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles