Man from Mandya won Rs 1 crore lottery from Kerala Govt కేరళ లాటరీలో అదృష్టం వరించిన మండ్యా యువకుడు

Sohan balram from mandya won rs 1 crore lottery from kerala govt

Sohan Balram, kerala, friends marriage, Facebook friend, Paravannur Kaipalakkal Prabhakaran, lottery ticket, Bhagyamitra lottery tickets, one crore rupees prize money, Puthanathani village, Somanahalli, Maddur taluk, Karnataka

Sohan Balram, son of an entrepreneur based in Somanahalli in Maddur taluk in the district, has won top prize of one crore rupees in the lottery he bought while visiting a friend in Kerala.

కేరళ లాటరీలో అదృష్టం వరించిన మండ్యా యువకుడు

Posted: 02/10/2021 02:57 PM IST
Sohan balram from mandya won rs 1 crore lottery from kerala govt

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో వ్వరూ చెప్పలేరు. దుబాయ్ నుంచి స్వేదేశానికి వచ్చే అనేక మందికి ఈ లాటరీలు కొనే అలవాటు వుంది. దీంతో తమ అదృష్టాన్ని వారు పరీక్షించుకుంటారు. గతంలో ఎన్నడూ లాటరీ వరించని వారితో పాటు పలు మార్లు లాటరీలోని చిన్న చిన్న ప్రైజు మనీని గెలుచుకున్నవారు కూడా లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. వీరిలో అధికశాతం కేరళకు చెందిన వారికే ఎక్కువగా ప్రైజ్ మనీ తగిలింది. అయితే అనుకోకుండా కేరళ ప్రయాణానికి వెళ్లి.. అక్కడ లాటరీ టిక్కెట్ కొన్న ఓ యువకుడు కోటిశ్వరుడు అయ్యాడు.

రాత్రికి రాత్రే తలరాత మారేలా ఈ లాటరీ టికెట్లు చేస్తుంటాయి, సాధారణ వ్యక్తిని కాస్తా రాత్రికి రాత్రే లాటరీ టికెట్లు కోటీశ్వరుడ్ని చేస్తాయి. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్‌ బలరామ్‌ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో  కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్‌.

తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్‌ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్‌ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్‌ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్‌ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్ మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles