Revanth starts padayatra in ryots’ support రెండో రోజు కోనసాగుతు్న్న రేవంత్ పాదయాత్ర

Revanth reddy converts his deeksha into 140km pada yatra in support of farmers

Revanth Reddy padayatra, Revanth padayatra from Acchampeta to Hyderabad, congress padayatra, sitakka, mallu bhativikramarka, vamshi chander reddy, Congress, Revanth reddy, Rajiv Rythu Bharosa deeksha, Revanth reddy padayatra, Achampeta, Mahaboobnagar, Telangana, Politics

In an impulsive decision, Congress working president and MP A Revanth Reddy on Sunday launched a padayatra in protest against the new farm laws introduced by the Central government. His decision met with a thunderous applause from both his party members as well as a large number of people who gathered at the place to show their solidarity with the protesting farmers.

ITEMVIDEOS: రైతు సమస్యలపై రెండో రోజు కోనసాగుతు్న్న రేవంత్ పాదయాత్ర

Posted: 02/08/2021 03:02 PM IST
Revanth reddy converts his deeksha into 140km pada yatra in support of farmers

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రెండో రోజు కోనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నుంచి నిన్న ఆయన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతులు పుట్టెడు కష్టాల్లో వుంటే తాను.. కారులో హైదరాబాద్ కు వెళ్లలేనని చెప్పిన రేవంత్.. రైతుల కోసం పాదయాత్రగా హైదరాబాద్ చేరుకుంటానని అన్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో వచ్చే గ్రామాల్లోని రైతులను కలసి వారి కష్టాలు తెలుసుకుంటానని చేప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఉప్పునూతల నుంచి రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

అచ్చంపేట నుంచి ప్రారంభమైన ఆయన రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర ఇవాళ ఉప్పునూతల, గట్టుకాడి పల్లి, కామ్సనూపల్లి, తిరుమలపూర్, డిండి మీదుగా చింతపల్లి వరకు సాగనుంది. అనూహ్యరీతిలో దీక్షను పాదయాత్రగా మార్చుతూ యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి.. నిన్న అచ్చంపేట నుంచి ఉప్పునూతల వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గట్టుకాడిపల్లి వద్ద పొలాల్లో పని చేసుకుంటున్న ఆడబిడ్డలతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేసీఆర్ ఇచ్చే రైతుబంధుతో ఉపయోగం లేదని.. ఎరువుల ధరలు, అన్ని సరుకుల ధరలు బాగా పెరిగిపోయాయని, కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్టుందని రేవంత్ రెడ్డి వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

తాను నల్లమల్ల బిడ్డనని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ఫ్రజల కోసం కొట్టాడే శక్తిని ఈ ప్రాంత ప్రజలు తనకు ఇచ్చారని చెప్పుకోచ్చిన ఆయన రైతులు కోట్ల రూపాయలను సంపాదించేందుకో.. లేక బీరువాల్లో బంగారం నింపుకునేందుకో వ్యవసాయం చేయడని చెప్పిన ఆయన.. కేవలం ఆత్మగౌరవం కోసం మాత్రమే రైతు వ్యవసాయం చేసి.. దేశాన్ని పోషిస్తాడని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులకు మార్కెట్ యార్డులు ఇకపై కనిపించవని, మద్దతు ధర కూడా అదృశ్యమవుతుందని అన్నారు. ప్రధాని రైతుల జీవితాలను అదానీ, అంబానీల పరం చేయబోతున్నారని దుయ్యబట్టారు.

నగర్ కర్నూల్ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్‌ రైతు భరోసా దీక్షలో పాల్గొన్న ఆయన.. రైతుల కోసం దీక్షలు కాదు పాదయాత్రలు చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు సూచించిన నేపథ్యంలో రేవంత్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చకుని పాదయాత్రను ప్రారంభించారు. ఈ మేరకు అదే వేదికపైనున్న రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. తాను అచ్చంపేట నుంచే హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ఇవాళ రెండో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles