అక్రమాస్థుల కేసులో బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలుశిక్షను అనుభవించిన అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి శశికళ.. ఇవాళ అభిమానుల కోలాహలం మధ్య చెన్నైకి చేరుకున్నారు. జైలులో వుండగానే ఆమెకు కరోనా సోకడంతో అమె జనవిర 27న జైలు నుంచి విడుదలైనా అసపత్రి నుంచి బయటకు వచ్చేందుకు సమయం పట్టింది. ఇక ఆ తరువాత బెంగుళూరోలోనే ఓ ఖరీదైన రిసార్టులో గత కొన్ని రోజులుగా బస చేసిన అమె ఇవాళ తమిళనాడులో అడుగుపెట్టారు. చెన్నైకి బయలుదేరే ముందు బెంగళూరులో జయలలిత చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన అమె.. మేనల్లుడు దినకరణ్ తో కలసి చెన్నైకి చేరుకున్నారు.
ఇవాళ ఉదయం సమారుగా పది గంటల సమయంలో అమె క్రిష్ణగిరి జిల్లాలోని అత్తిపల్లి గ్రామంలోకి అడుగుపెట్టడంతో.. తమిళనాడులోకి అడుగుపెట్టినట్లైయ్యింది. అమె రాకను అమె పార్టీ అభిమానులు, శ్రేణులు ఘనంగా స్వాగతించారు. డప్పులు వాయిస్తూ అందుకు అనుగూణంగా నృత్యాలు చేస్తూ.. మహిళలు అమె కూర్చున్న కాన్వాయ్ లోని కారుపై పూలు చల్లూతు అహ్వానించారు. ఇలా రమారమి బెంగుళూరు నుంచి చెన్నై చేరుకునే ప్రతీ కూడలి వద్ద అమెకు అభిమానులు ఘనస్వాగతం అందించారు. ఈ క్రమంలో హోసూరు చేరుకున్న అమె అక్కడ మారియమ్మాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
ఇక అమె ఇవాళ చెన్నైలోని తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ స్మారణ భవనాన్ని కూడా సందర్శించనున్నారు. జయలలిత స్మారక మందిరాన్ని కూడా అమె సందర్శిస్తానని అన్నా అమెకు అనుమతి లభించలేదు. దీంతో అమె మంగళవారం సాయంత్రం జయలలిత స్మారక భవనాన్ని సందర్శించనున్నారు. అమె కాన్వాయ్ లో దాదాపు 200 వాహనాలు వున్నాయి. కాగా అమె తన కారుపై అన్నాడీఎంకే జెండాను ఎగరేయడంతో.. పార్టీ జెండాలు, గుర్తుల అంశంపై ఇప్పటికీ న్యాయస్థానంలో కేసులు వుండగా, దానిని వినియోగించడంపై పోలీసులు అమెకు నోటీసులు అందించారు.
కాగా, తమిళనాడు సరిహద్దు జిల్లా కృష్ణగిరిలోని పోచంపల్లి వద్ద శశికళకు స్వాగతం పలికేందుకు బాణసంచా కాల్చడం వల్ల ఓ మద్దతుదారుడి కారులో మంటలు చెలరేగాయి. వాటికి హోరున వీస్తున్న గాలిదీంతో పక్కనే ఉన్న మరో కారుకు మంటలు వ్యాపించి.. రెండు కార్లూ దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక మరో సంఘటన కూడా చోటచేసుకుంది. మార్గమధ్యలో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంపై అమె కారును వేగంగా ఫాలోఅయ్యాడు. దీంతో అమె బాడీగార్డులు యువకుడిని పట్టుకుని.. ఎందుకు వెంబడిస్తున్నావని విచారించారు. యువకుడి కోరిక మేరకు అతనితో సెల్పీ దిగిన శశికళ.. ముందుకు సాగింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more