ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా మహమ్మారిని నిలువరించేందుకు పలురకాల వాక్సీన్ లు అందుబాటులోకి రావడంతో ప్రజల్లో నెకొన్న ఒకంత అందోళన సన్నగిల్లుతోంది. కాగా ఈ తరుణంలోనే మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది. వాక్సీన్ మాత్రమే కాదు ఇకపై కరోనాకు నోటి ద్వారా తీసుకునే ఔషదాన్ని కూడా తీసుకువస్తున్నామని బ్రిటన్ కు చెందిన నాటింగ్ హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో వున్న రెమిడెసివీర్ సహా ఇతర ఔషదాలతో పోల్చితే అత్యంత ప్రభావవంతమైన ఔషదంగా ఇది నిరూపితమైందన్నారు.
యాంటీ వైరల్ డగ్ర్ గా అందుబాటులోకి రానున్న తమ ఔషదం.. వైరల్ ఇన్పెక్షన్లను కూడా తగ్గించడంతో దోహదపడుతుందని అన్నారు. ఇది కరోనాతో పాటు, దానికి సంబంధించిన మరిన్ని వైరస్ లపైనా కొత్త రకాల కరోనాపైన కూడా ప్రభావవంతంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. నాటింగ్ హామ్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలు 'వైరసెస్' అనే జర్నల్ ప్రచురించింది. కరోనా ఔషధాలపై ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వృక్ష సంబంధ పదార్థాల నుంచి తయారు చేసిన థాప్సిగార్గిన్ అనే వైరస్ ఔషధాన్ని నియమిత మోతాదులో ఇస్తే, అది కొవిడ్ ను శరీరంలో నాశనం చేస్తోందని కనుగొన్నారు.
ఇది కొవిడ్ పైనే కాకుండా, శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించే మరో రెండు వైరస్ లపైనా పని చేస్తోందని, దీన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇక దీన్ని వ్యాధి సోకక ముందు, సోకిన తరువాత కూడా వినియోగించవచ్చని, వేరువేరుగా గుర్తించడం సాధ్యం కాని వివిధ రకాల వైరస్ లు శరీరంలోకి ప్రవేశించిన వేళ, థాప్సిగార్గిన్ చక్కగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ వైరస్ లు శరీరంలో వృద్ధి చెందకుండా ఔషధం పని చేస్తుందని, కనీసం 48 గంటల పాటు రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఔషదాన్ని నోటి ద్వారా తీసుకునే మాత్రగా తీసుకుని వస్తున్నామని, ఇంజక్షన్లు లేదా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఇక రాబోదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఈ థాప్సిగార్గిన్ ఔషధ ప్రయోగం తొలి దశలో ఉంది. ఈ తొలిదశ ఫలితాలే తమకు అత్యంత కీలకమని నాటింగ్ హామ్ శాస్త్రవేత్తల బృందంలోని ప్రొఫెసర్ కిన్ చౌ చాంగ్ వెల్లడించారు. భవిష్యత్తులో మానవాళిని ఇబ్బంది పెట్టనున్న వైరస్ లు కూడా జంతువుల్లోనే పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. వాటిని అరికట్టాలంటే థాప్సిగార్గిన్ వంటి కొత్త తరం యాంటీ వైరల్ ఔషధాల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more