Dog survives night in a toilet with leopard చిరుతతో మరుగుదొడ్డిలో ఇరక్కున శునకం..

Dog miraculously survives after getting trapped in toilet with leopard for 7 hours

Leopard in Karntaka, Karnataka leopard, Dog and leopard in toilet, Karnataka news, Wildlife, Leopard attack dog Karnataka, Dog trapped in toilet, Karnataka leopard news, Karnataka leopard caught, Stray dog, Toilet, Bilinele, Karnataka leopard rescue, Karnataka leopard video, Banerghatta forest, Karnataka police, Crime

A stray dog in Karnataka’s Bilinele village found itself locked inside a toilet with a leopard for hours on Wednesday. The two animals were found inside the toilet by a local resident at 7 am and she quickly bolted the door and alerted the police.

ITEMVIDEOS: చిరుతతో మరుగుదొడ్డిలో ఇరక్కున శునకం.. సజీవం..

Posted: 02/04/2021 12:58 PM IST
Dog miraculously survives after getting trapped in toilet with leopard for 7 hours

ఎవరైనా ఇక తమ పని అయిపోయింది అన్నారంటే.. వారికి అతి పెద్ద ప్రమాదంలో వున్నారన్నట్లే.. ఇక చావు దాకా వెళ్లి వచ్చామనో.. లేక స్వర్గం దాక వెళ్లివచ్చామనో అంటే వారు వెంటుకవాసిలో మరణం నుంచి తప్పించుకున్నారని అర్థం. కానీ.. ఏడు గంటల పాటు చావుకు అతి చేరువుగా వుంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ మూలన కూర్చంటే.. వారి పరిస్థితి ఏమిటీ.. వారు ఏమని చెప్పాలి. అయితే చావును చంకన పెట్టుకుని ఏడు గంటలు కూర్చున్న జీవీకి మాటలు రాకపోతే ఇక దాని పరిస్థితి ఏమిటి.? భూమి మీద నూకలు వుంటే అది బతికిందని చెప్పక తప్పదు.

అభయారణ్యం సమీపంలోని జనవాసాల మధ్యకు అనుకోకుండా వచ్చిందీ ఓ చిరుతపులి. దాని కంట ఓ వీధి కుక్క పడింది. చిరత నుంచి తప్పించుకునేందుకు అది మరుగుదోడ్డిలోకి దూరింది. అంతే దాని వెంటే వచ్చిన చిరుత కూడా మరుగుదొడ్డిలోకి చేరుకుంది. అనుకోకుండా రెండు మరుగుదొడ్డిలోనే ఇరుక్కుపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమనుకుంటారు.? చిరుత చేతిలో శునకం పని అయిపోయింది అనకోకమానరు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం జరగింది. కుక్కను కనీసం ఏమీ అనకుండా చిరుత ఓ మూలన.. శునకం మరో మూలన వుండిపోయాయి. అదీనూ ఏకంగా ఏడు గంటల పాటు. ఇది నిజంగా విధి విచిత్రమే కదా.  

ఇక వివరాల్లోకి వస్తే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని భిళ్ళినెల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత వారం రోజులుగా సమీపంలోని బనేర్ ఘట్టా అటవీప్రాంతం నుంచి ఓ చిరుత తమ జనవాసాల్లో తిరుగుతుందని స్థానికులు గుర్తించారు. దీంతో పోద్దెక్కే వరకు వారు భయంతో బయటకు కూడా వెళ్లడం లేదు. అయితే క్రితం రోజున ఓ మహిళ ఉదయం 7 గంటలకు తన మరుగుదోడ్డి తలుపు తీసి చూసేవరకు చిరుతపులితో పాటు శునకం అందులో వున్నాయి. దీంతో వెంటనే అమె బయట నుంచి గడియపెట్టింది. స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు చిరుత విషయమై సమాచారం అందించారు.

అయితే రంగంలోకి దిగిన అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు సుమారు ఏడు గంటల పాటు అనేక వ్యయప్రయాసలు పడ్డారు. అంతసేపు ఈ రెండు మరుగుదొడ్డిలోనే వున్నాయి తప్ప ఈ క్రమంలో చిరుత.. వీధి కుక్కపై దాడి చేయలేదు. చిరతపులి మీదకి కుక్క అరవలేదు. రెండూ అక్కడే దాక్కున్నాయి. చిరుత కోసం బోను, వలలు ఏర్పాటు చేశారు. ముందుగా కుక్కను రక్షించారు. కానీ, అప్పటికే చిరుత పారిపోయింది. ఇక దాని కోసం వేట సాగిస్తున్నారు. కర్ణాటకలోని కైకాంబ గ్రామంలో బుధవారం  ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు మిర్రర్ ట్వీట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Animals  Dogs  leopard  leapord chase dog  viral animals  stray dog  Police  Karnataka police  Crime  

Other Articles