4 people eat 30 kg of oranges in 30 Minutes అదనపు చార్జీలకు చెక్.. అరగంటలో లగేజీ అరగింత..

4 men eat 30 kg oranges in half an hour to avoid paying extra baggage fee

air travel, baggage fee, Chinese men, Extra Baggage Fee, Jugaad, oranges, Travellers, Kunming, Yunnan Province, china

No one wants to pay extra luggage fees at the airport. But it is hard to believe that 4 passengers from China did it to avoid this charge. In fact, four Chinese passengers finished eating 30kg of oranges in 30 minutes at an airport in Kunming, southwest China’s Yunnan Province.

ఇదో వింత: అదనపు చార్జీలకు చెక్.. అరగంటలో లగేజీ అరగింత..

Posted: 01/28/2021 05:40 PM IST
4 men eat 30 kg oranges in half an hour to avoid paying extra baggage fee

బస్సు, రైలు, విమానం ఏ రవాణ మార్గన ప్రయాణించినా.. అదనపు లగేజీ ఉంటే దానికంటూ ప్రత్యేక మొత్తాన్ని చల్లించక తప్పదు. అయితే ఒక్కోసారి లగేజీ చార్జీ మనం తీసుకెళ్తున్న వస్తవుల ధర కన్నా ఎంతో అధికంగ వుంటుంది. అయితే ఖరీదును పక్కనబెడితే.. ఆ లగేజీలో వుండే వస్తువులపై ఇష్టమో లేక విలువ అమూల్యమై వుంటుంది. దీంతో అటు లగేజీలోని ఆ వస్తువులను వదులుకోనూ లేక.. వాటికి పెద్ద మొత్తంలోనూ డబ్బులు చెల్లించనూ లేక తర్జనభర్జన మధ్య నిర్ణయం తీసుకోనూ లేక ఇబ్బంది పడుతుంటారు పలువురు ప్రయాణికులు.

సరిగ్గా అలాంటి సంఘటనే చైనాలో జరిగింది. నలుగురు మిత్రలు కలసి ఓ బిజినెస్ వ్యవహారంగా చైనాలోని కున్ మింగ్ ప్రాంతానికి వెళ్లి తిరిగి అక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందకు సిద్దం అవుతుండగా వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది వారు తెచ్చుకున్న లగేజీ. నైరుతి చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని కున్ మింగ్ విమానాశ్రయంలో జరిగింది,  నలుగురు స్నేహితులకు ఈ సవాల్ ను ధీటుగా ఎదుర్కోని విమానాలను ఎక్కేసి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అంటే లగేజీకి అదనపు చార్జీలను చెల్లించారా.? లేక లగేజీని అక్కడే వదిలేసారా.? అన్న సందేహాలకు అస్కారమే లేదు.

అదెలా.? అంటే ఈ నలుగురికి కలిపి విమానంలో ఇరవై కేజీల లగేజీకి మాత్రమే అనుమతి వుందన్న విషయం తెలియని నలుగురు మిత్రులలోని వాంగ్ అనే ఓ మిత్రుడు ఏకంగా కొ్న్ని యువాన్లతో (రూ. 564) లతో యాభై కేజీల నారింజ పళ్లను కొన్నాడు. తీరా విమానాశ్రయంలోనికి వచ్చి వారు చెక్ ఇన్ అవుతుండగా, లగేజీ ముఫై కిలోలు అదనంగా వుందని.. ఒక్కో కేజీకి పది యువాన్ల చోప్పున మూడు వందల యువాన్లు (భారత కరెన్సీలో రూ. 33,364) చెల్లించాలని చెప్పారు. దీంతో ఖంగుతిన్న స్నేహితులు ఆ నారింజ పండ్లను విడిచిపెట్టలేక.. తమ వెంట తీసుకుని రాలేక సతమతమయ్యారు.

దీంతో వారికి ఓ చక్కని ఐడియా వచ్చింది. అయితే తమ విమానం చెక్ ఇన్ అయ్యేందుకు కేవలం అరగంట సమయం మాత్రమే వుందని తెలియడంతో వారు ఈలోగానే తమకు వచ్చిన ఐడియాను అమలు చేయడంతో పాటు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇంతకీ ఏంటా ఐడియా అంటే.. లగేజీకి అదనపు చార్జీలు కట్టే బదులుగా వాటిని అరగంటలో అరగించడమే. విమానాశ్రయంలోనే ముఫై కేజీల నారింజ పండ్లను ఎంచక్కా లాగించేశారు. డబ్బులు పెట్టి కోన్న నారింజ పండ్లను వదల్లేక వారు అరగంటలో పండ్లను తినేశారు. ఈ విధంగా వారు లగేజీ చార్జీని తగ్గించుకున్నారు. ఈ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారి నవ్వులు పూయించింది.

జరిగిన ఘటనపై 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురిస్తూ, వాంగ్ అనే వ్యక్తి, అతని సహచరులు నారింజ పండ్ల బాక్స్ లను తెచ్చారని, ఆపై రవాణా చార్జీల గురించి తెలుసుకుని అవాక్కై విమానాశ్రయంలోనే ఆ నలుగురు కలసి వాటిని లాగించేశారని.. ఆ తరువాత వారు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు విమానాన్ని కూడా సకాలంలోనే ఎక్కారని పేర్కొంది. అయితే, వారు చేసిన పని వికటించింది. ఒక్కసారిగా విటమిన్ సీ శరీరంలోకి అధికమొత్తంలో వెళ్లడంతో ఆ నలుగురూ నోటి పుండ్లతో బాధపడ్డారని పత్రిక పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oranges  baggage fee  china  chinese travellers  airport  

Other Articles