Parliament canteen non-veg buffet costs Rs. 700 పార్లమెంటు క్యాంటీన్ లో భగ్గుమన్న ధరలు..

Roti at rs 3 non veg buffet at rs 700 parliament canteen sheds subsidy

Parliament Canteen, Parliament Canteen Subsidy, Hyderabadi Mutton Biryani, Roti, boiled vegetables, chicken birayani, Veg buffet, Non Veg buffet, vegetarian meal, Parliament, parliament members, RajyaSabha, Lok Sabha, visitors, National, Politics

The parliament canteen announced new prices this week show most items will be sold at par with market rates. A roti will cost ₹ 3, a vegetarian meal ₹ 100, and a non-vegetarian lunch buffet ₹ 700. The Mutton Biryani will now come in at ₹ 150 and the British heirloom of boiled vegetables ₹ 50.

పార్లమెంటు క్యాంటీన్ లో భగ్గుమన్న ధరలు.. వెజ్ బఫె రూ.500

Posted: 01/28/2021 03:42 PM IST
Roti at rs 3 non veg buffet at rs 700 parliament canteen sheds subsidy

పార్లమెంట్ క్యాంటీన్ లో చట్టసభ సభ్యులకు దశాబ్దాలుగా అందిస్తోన్న సబ్సీడీని రద్దు చేయాలన్న ప్రయత్నాలకు ఎట్టకేలకు విజయవంతం చేశారు లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా. క్యాంటీన్ లో లభించే రాయితీ అహారాన్నికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకున్న ఆయన ఈ అదేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నుంచే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్‌.. పార్లమెంటు క్యాంటిన్ లో లభించే కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త జాబితాలో ధరల మోత భగ్గుమంది. దీంతో ధరాఘాతం ప్రభావం ఎంపీలకు కూడా తెలియనుంది.

ఇక కొత్త ధరల ప్రకారం పార్లమెంటు క్యాంటీన్ లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ.3కి లభిస్తుండగా.. అత్యంత అధిక ధర నాన్ వెజ్ బఫెకు నిర్ణయించారు. మాంసాహార బపెను తినాలనుకునే వారు తప్పక తమ జేబుల్లోంచి రూ.700లు వెచ్చించాల్సిందే. ఇక శాఖహార బపెకు మాత్రం రూ. 500లుగా నిర్ణయిస్తూ కొత్త ధరల పట్టికను లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర తరపున పార్లమెంటు క్యాంటీన్ జాబితాలో చోటు దక్కించుకున్న గుమగుమలాడే హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఇకపై ఘాటెక్కనుంది.

ఇటీవల దీనిని క్యాంటీన్ లో ప్రవేశపెట్టిన నాటి నుంచి కేవలం రూ.65లకే అందరికీ అందుబాటులోకి వచ్చిన బిర్యానీ ఇకపై మాత్రం బయట హోటళ్లలో లభించే విధంగానే రూ.150కు లభించనుంది. అలాగే శాఖాహార బోజనం చేయాలనుకునే వారు ఇక నుంచి రూ.100ని ఖర్చు చేయాల్సిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతీ ఏటా సుమారు రూ. 8 కోట్ల రూపాయలను అదా చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్ ను భారత పర్యాటక అభివృధ్ది కార్పొరేషన్‌ నిర్వహించనుందని లోక్ సభ స్పీకర్‌ ఓంబిర్లా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles