SC stays Bombay HC order on POCSO Act బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే.. కౌంటర్ దాఖలుకు ఆదేశం

Supreme court stays bombay hc order on skin to skin contact for sexual assault

POCSO Skin to skin contact bombay high court judgment, skin to skin groping bombay hc, pocso, supreme court, groping case, bombay high court, posco act, Attorney General, KK Venugopal, Chief Justice, SA Bobde, counter petition, molestation, crime on children, molest on girl child, Bombay High Court Nagpur Bench, Justice Pushpa V Ganediwala, crime

The Supreme Court stayed the controversial judgment of the Bombay High Court which had held that pressing the breast of a 12-year old child without removing her top will not fall within the definition of ‘sexual assault’ under Section 7 the Protection of Children from Sexual Offences Act (POCSO).

బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే.. కౌంటర్ దాఖలుకు ఆదేశం

Posted: 01/27/2021 04:38 PM IST
Supreme court stays bombay hc order on skin to skin contact for sexual assault

చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరకంగా మారుతుందని.. ఈ తీర్పును కోట్ చేసి లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా చాలా వరకు వున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది అటర్నీ జనరల్ కెకె వెణుగోపాల్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించాలని కోరిన ఆయన అలా కానీ పక్షంలో తాము (రేపు) గురువారం ఈ అంశంపై పిటీషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ తీర్పుపై ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అటర్నీ జనరల్ అభ్యర్థనను స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్టే విధించింది. ఈ కేసులో బాంబే హైకోర్టు నిర్దోషిగా పరిగణించిన నిందితుడికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేయాలని ఏజీని అదేశించింది.

బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పు పూర్వపరాలు..

2016లో నాగ్ పూర్ పరిధిలోని సతీష్‌ అనే వ్యక్తి తమ ఇరుగుపోరుగున వుండే ఓ బాలిక(12)కు పండు ఇస్తానని ఆశ చూపి.. అమె ఎద బాగాన్నితాకుతూ.. అమె బట్టలను విప్పేందుకు ప్రయత్నించాడు. ఈలోగా భయంతో కేకలు వేయగా, అమె తల్లి అక్కడికి వచ్చి.. నిందితుడ్ని పట్టుకుని పోలీసుకులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేయగా విచారించిన దిగువ కోర్టు నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు.

కాగా, బాంబే హైకోర్టులో విచారణలో నిందితుడ్ని నిర్దోషిగా పరిగణిస్తూ తీర్పును వెలువరించింది. ‘పోక్సో’ చట్టం(లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) ప్రకారం.. చిన్నారులను నగ్నంగా సున్నితమైన బాగాలను తాకితే అది నేరమని, దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విషదీకరిస్తోందని వ్యాఖ్యానించింది.

ఈ కేసులో నిందితుడు బాలిక దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న విషయాలపై నిర్దిష్టమైన వివరాలు లేవని, దీంతో ఈ కేసును లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని తెలిపింది. ఈ మేరకు కేసులో నిందితుడికి కింది కోర్టులో విధించిన మూడేళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఈ కేసులో నిందితుడు శిక్ష నుంచి ఉపశమనం లభించింది. కాగా బాంబే హైకోర్టు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ తీర్పును ఖండించిన మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు.. దీనిపై సుప్రీంకోర్టును వెళ్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  groping case  bombay high court  posco act  Attorney General  KK Venugopal  Crime  

Other Articles