Chiranjeevi to support JanaSena, says Nadendla పవన్ కల్యాణ్ జనసేనకు చిరంజీవి మద్దతు: నాదేండ్ల

Chiranjeevi to support pawan kalyan in politics says nadendla manohar

Chiranjeevi to support Pawan Kalyan in politics, Chiranjeevi to support Jana Sena in politics, Chiranjeevi pawan kalyan janasena, chiranjeevi nagababu pawan kalyan, Jana Sena, Pawan Kalyan, Chiranjeevi, JSP PAC chairman, Nadendla Manohar, Andhra Pradesh, Politics

JanaSena Party’s Political Affairs Committee (PAC) chairman Nadendla Manohar said that megastar Chiranjeevi would be supporting JSP chief Pawan Kalyan in politics. He made this statement while addressing the Jana Sena workers after launching an accidental death insurance drive to them.

ITEMVIDEOS: పవన్ కల్యాణ్ జనసేనకు చిరంజీవి మద్దతు: నాదేండ్ల

Posted: 01/27/2021 03:52 PM IST
Chiranjeevi to support pawan kalyan in politics says nadendla manohar

జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నూతనోత్తేజాన్ని కలిగించాయి. జనసేన పార్టీకి తన నైతిక మద్దుతును అందిస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని ఆయన జనసేన కార్యకర్తల సమావేశంలో చెప్పడంతో హర్షాతీరేకలు వెల్లివిరిసాయి, ఆయన సలహాతోనే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారని కూడా చెప్పారు.

నాదెండ్ల మనోహర్ విజయవాడలో జనసేన సమావేశంలో మాట్లాడుతూ, పవన్ తో కలిసి నడిచేందుకు తాను సిద్ధమేనన్న సానుకూల సంకేతాలను చిరంజీవి అందించారని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం వుందని, వీటిలో మూడేళ్లు సినిమాలు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలు చేసుకోవాలని పవన్ కు చిరంజీవి సూచించారని వివరించారు  పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను కూడా అండగా నిలుస్తానని చిరంజీవి చెప్పారని నాదేండ్ల చెప్పారుం. దీంతో వేదిక కింద ఉన్నవారితో పాటు వేదికపై ఆసీనులైన వారి నుంచి కూడా కరతాళధ్వనులు, ఈలలు వెల్లివిరిసాయి,

జనసేన కార్యకర్ధలకు ప్రమాద భీమాను అందించే ప్రక్రియను ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పునరాగమనం చేస్తున్నారా.? అన్న వార్తలు జోరందుకున్నాయి, ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికలకు వెళ్లిన వెళ్లిన 2009లో ఆయన పార్టీ ఆశించిన మేర స్థానాలను కైవసం చేసుకోలేదు. దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన పర్యావసనాలతో ఆయన రాజకీయాలకు దూరంగా వుండిపోయారు. ఇక తాజాగా జనసేనుకు తాను మద్దతునిస్తారన్న నాదేండ్ల వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ లో జోష్ నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  Chiranjeevi  JSP PAC chairman  Nadendla Manohar  Andhra Pradesh  Politics  

Other Articles