'Who gave Balakot information to Arnab Goswami?' దేశ రహస్య సమాచారాన్ని లీక్ చేసిందెవరు?: రాహుల్ గాంధీ

Providing official secret info to journalist criminal act rahul gandhi

secret information, criminal act, Congress leader, Rahul Gandhi, Republic TV WhatsApp chats, Arnab WhatsApp chats, Arnab Goswami, social media, Congress, BJP, Republic TV, PM Modi, Amit Shah, WhatsApp chats, Arnab leaked chats, NSA, Defence Minister, Balakot Airtsrike, Pulwama attack, Indian Army, secret information, criminal act, Politics, Crime

Providing official secret information to a journalist is a 'criminal act' and both the giver and the receiver will have to go to jail, Congress leader Rahul Gandhi said on Tuesday referring to the purported WhatsApp chats of Republic TV editor-in-chief Arnab Goswami doing the rounds of social media.

వీళ్లా.. దేశభక్తులు.! దేశ రహస్య సమాచారాన్ని లీక్ చేసిందెవరు?: రాహుల్ గాంధీ

Posted: 01/19/2021 09:17 PM IST
Providing official secret info to journalist criminal act rahul gandhi

అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం విషయంలో అందులోనూ అత్యంత ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన కీలకమైన సమాచారం మూడు రోజుల ముందుగనే ఓ జర్నలిస్టుకు ఎలా లీకైందని ఆయన ప్రశ్నించారు. దేశప్రజలకు చెప్పే దేశభక్తి ఏదీ అని ఆయన ప్రశ్నించారు, అత్యంత గోప్యమైన సమాచారం దేశానికి చెందిన అత్యున్నత పదవులలో వున్నవారికి మాత్రమే తెలియాల్సిన సమాచారం ఓ జర్నలిస్టుకు ఎలా చేరిందని ఆయన నిలదీశారు.

రాజకీయ లబ్దిని పోందాలనే ఈ తరహా దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు లీక్ చేశారని ఆయన అరోపించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పుల్వామా దాడులు జరగడం మంచి జరిగిందని ఒకరు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ దాడులు జరగడంతో తాము రాజకీయ లబ్దిని పోందామని, తిరిగి అధికారంలోకి రాగలిగామని మరోకరు వ్యాఖ్యలు చేయడంపై కూడా ఆయన మండిపడ్డారు, దేశ ఎయిర్ ఫోర్స్ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని రిస్క్ లో పెట్టి ఈ సమాచారం లీక్ చేయడంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు నిజమైన దేశభక్తులే అయితే ఈ సమాచారం ఎలా లీక్ అయ్యిందన్న విషయాన్ని తెలిపాలని ఆయన ప్రశ్నించారు.

బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, మరొకరికి మధ్య నడిచిన వాట్సాప్ సంభాషణపై దర్యాప్తుకు అదేశించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశానికి సంబంధించిన సమాచారం లీక్ అయినా ప్రధాని మోదీ ఎలా నిమ్మకున్నారని ప్రశ్నించారు. దేశ రక్షణ విభాగానికి సంబంధించిన అధికారిక రహస్యాలను ఓ జర్నలిస్టుకు ఇవ్వడం క్రిమినల్ చర్య అన్నారు. ఈ సంభాషణ లీక్ అయినందుకు మీదే బాధ్యత అని, ఈ సమాచారాన్ని ఎవరు లీక్ చేశారన్న దానిపై మీరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరపలేదని అన్నారు. ఈ దాడుల గురించి కేవలం ప్రధాని మోడీకి, దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లకు మాత్రమే తెలిసి ఉండాలన్నారు.

కానీ అత్యంత సున్నితమైన అధికారిక రహస్యాలు మూడు రోజుల ముందుగానే ఓ జర్నలిస్టుకు తెలియడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీంతో ఎయిర్ ఫోర్స్ దాడుల విషయం పాకిస్థాన్ కూడా తెలిసివుండవచ్చునని అనుమానాలాను వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఇలాంటి అధికారిక సమాచారాన్ని పోందడం, లీక్ చేయడం రెండూ దేశద్రోహం కిందకే వస్తాయని ఆయన అన్నారు, అర్నాబ్ కు ఎవరు సమాచారం అందించారో తెలుసుకోవాలని యావత్ దేశం కోరుతుందన్నారు, ప్రధాని మోదీయే ఇచ్చారా లేక హోం మంత్రా అని ప్రశ్నించారు. ఇక బాలాకోట్ దాడులపై అర్నాబ్ గోస్వామికి, టీవీ రేటింగ్స్ ఏజన్సీ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తాకు మధ్య వాట్సాప్ సంభాషణపై శివసేన నేత సంజయ్ రౌత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అంశమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles