(Image source from: Twitter.com/AndhraPradeshCM)
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల కమీషన్ మ్రోగించిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును విడుదల చేస్తామని ప్రకటించగా, అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజారోగ్యాన్ని కాలు వేసేందుకు కరోనా మహమ్మారి మాటు వేసి వున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఎన్నికలు కావాల్సి వచ్చాయని ఆయన ఘాటుగానే స్పందించారు.
అయితే ఈ తరహా వాదనలు ప్రభుత్వం తరపున వినిపించినా హైకోర్టు గతంలో పరిగణలోకి తీసుకోని విషయం ద్వివేది మర్చిపోయారా.? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి, ఇక దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమ నిర్ణయానికి కట్టుబడుతూ సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వివరించారు. ఆపై, ఫిబ్రవరి 5, 7, 9, 17న దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు.
ఇక ఫిబ్రవరి 17వ తేదీని చివరి దశ పోలింగ్ జరిగిన తరువాత అదే రోజునే సాయంత్రం 4 గంటల నుంచి అన్ని పంచాయతీల ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. ఇక షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన.. కరోనా సెకండ్ వేవ్ ను సాకుగా చూపుతూ రాష్ట్ర సర్కారు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని భావిస్తోందని, అయితే ఈ వేవ్ ప్రభావం అధికంగా వున్న అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలే జరిగాయన్న విషయం వారు గుర్తెరుగాలని పేర్కోన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పూర్తిగా అదుపులో వుందని, యాక్టీవ్ కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయని ప్రభుత్వం గణంకాలే స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఇదిలావుండగా వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారని పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ద్వివేది అన్నారు. అధికారులు, సిబ్బంది మొత్తం టీకా సన్నాహక కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారని తెలిపారు. 11న మోదీ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13 తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపడదామంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారని, అయినప్పటికీ నిమ్మగడ్డ పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ఏకపక్షంగా రద్దు చేసిన అధికారి.. ఎన్నికల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్‌లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more