Pigs create havoc in Tirumala tirumada streets తిరుమల శ్రీవారి తిరుమాఢ వీధుల్లో వరాహాలు.. నెట్టింట్లో వీడియోలు.!

Pigs create havoc in tirumala tirumada streets video goes viral

Tirumala Tirupati Devasthanam, TTD officials, TTD staff, TTD negligence, TTD Tirumada streets Pigs, Tirumada vidhulu, Tirumada vidhulu Pigs, Tirumala tirumada streets, Pigs TTD videos, pigs ttd video viral, ttd videos viral, crime

Tirumala Tirupati Devasthanam officials and staff negligence is being pointed out as Pigs moved in Tirumala tirumada streets. Pigs created havoc and the videos goes viral on net.

ITEMVIDEOS: తిరుమల శ్రీవారి తిరుమాఢ వీధుల్లో వరాహాలు.. నెట్టింట్లో వీడియోలు.!

Posted: 01/18/2021 10:21 PM IST
Pigs create havoc in tirumala tirumada streets video goes viral

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు తెలుగు ప్రజల ఇలవేల్పుగా కొంగుబంగారమైన విషయం తెలిసిందే. కాగా, తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు ముందు భక్తులు ముందుగా వరహామూర్తి దేవాలయంలో ఆయన దర్శనం చేసుకోవాలన్న నానుడి కూడా వుంది. అయితే ఈ విషయం తెలిసిన భక్తులు దీనినే పాటిస్తుండగా, తెలియని వారు మాత్రం శ్రీవారి దర్శనాన్నే నేరుగా చేసుకుంటారు. భక్తుల విషయం అటుంచితే గత ఏడాది నిర్వహించిన బ్రహోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆలయంలోనే వాహనాలపై తిప్పిన ఆలయ అధికారులు.. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగూణంగానే బ్రహోత్సవాలను నిర్వహించారు.

అయితే తిరుమల శ్రీవారి మాడ వీధులను మాత్రం.. కలియుగ దైవం సంచరించే మార్గంగా అత్యంత పవిత్రంగానే భక్తులు విశ్విసిస్తారు. కాగా ఈ తిరుమాడ వీధుల్లో వరహాల (పందుల) గుంపు దర్జాగా సంచరించడం సంచలనంగా మారింది. భక్తుల విశ్వాసాలకు తూట్లు పోడిచేలా వరాహాలు తిరుమాడ వీధుల్లో సంచరించడం భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అత్యంత పవిత్రంగా చూడాల్సిన తిరుమాడ వీధుల్లో దేవాలయ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పందులు గుంపులుగుంపులుగా సంచరించడం సంచలనంగా మారింది. వీటిని గమనించిన పలువురు భక్తులు తమ సెల్ ఫోన్లలో ఫొటోలు వీడియోలను చిత్రీకరించారు.

వాటిని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి, టీటీడీ దేవాలయ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 11 పందులు గొల్ల మండపం నుంచి మాఢ వీధుల్లోకి ప్రవేశించాయి. ఆపై తమ కిష్టం వచ్చినట్టుగా తిరుగాడాయి. వీటిని గమనించిన విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమేసేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అవి వెళ్లిపోయిన తరువాత, మాడ వీధుల్లోకి పందులు వస్తున్న మార్గాన్ని గుర్తించి, అక్కడ ఇనుప కంచెలను వేశారు. స్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆలయ సిబ్బందితో పాటు వీడియోలు పోటోలు తీసిన సిబ్బందిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు పందులను తరమేందుకు బదులు వీడియోలు తీయడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి, ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

(Video Source: TV9 Telugu Live)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles