Farmers protests continue to protest on day 27 దిగిరాని కేంద్రం.. 27వ రోజుకు చేరిన రైతన్న ఉద్యమం

Farmers protests continue to protest centre pushes kisan union for discussion

India, Farmers, Supreme Court to form committee to resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

The long going farmers protest against the new farm bills has reached day 27 and the agitation has intensified with a rally hunger strike initiated from yesterday by the protesting farmers. After the government pushed the farmers to specify dates for further discussions, today the farmer union will be having a meeting to discuss on this entire situation.

దిగిరాని కేంద్రం.. 27వ రోజుకు చేరిన రైతన్న ఉద్యమం

Posted: 12/22/2020 10:18 AM IST
Farmers protests continue to protest centre pushes kisan union for discussion

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు దేశరాజధాని శివార్లలోని సింఘు, టిక్రీ ప్రాంతంలో చేపడుతున్న నిరసన ఉద్యమం 27వ రోజుకు చేరింది. నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునే విషయంలో కేంద్రం దిగిరాకపోవడంతో రైతన్నలు దీక్షలను కొనసాగిస్తూనే వున్నారు. అసలే చలికాలం.. యముకలు కొరికే చలి వెన్నులోకి చేరి ఇప్పటికే కొందరు రైతులను అస్వస్థతతకు గురిచేసినా.. మరికొందర్ని అనంతవాయువులలో కలిపేసినా.. రైతులు మాత్రం ఉమ ఉనికికే ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని భీష్మిస్తున్నారు.

రైతులు సాగిస్తున్న ఈ ఉద్యమానికి పంజాబ్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తుండగా, ఇక క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు ఈ ఉద్యమం పాకుతోంది. ఇదివరకే ఏపీలోని రైతు సంఘాలు కూడా హస్తినలోని రైతు ఉద్యమానికి మంద్దతుగా తాము నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. ఇక తాజాగా మహారాష్ట్ర  నాసిక్ కు చెందిన దాదాపు మూడు వేల మంది రైతులు కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకునేందుకు ర్యాలీగా బయలుదేరారు. మరో ఒకటి రెండు రోజుల్లో నాసిక్ రైతలు వాహనాల శ్రేణి ఢిల్లీలోని టిక్రీ ప్రాంతానికి చేరుకోనుంది. ఇక ఇదే సమయంలో కేంద్రం తమతో చర్చలు జరిపే విషయంమై తాజాగా ఇచ్చిన లేఖ విషయంలోనూ రైతు సంఘాలు పునరాలోచనలో పడ్డాయి.

నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ అందోళనలో భాగంగా రహాదారులపై బైఠాయించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రోజుకు 11 మంది రైతులు నిరసన దీక్షలను చేపట్టనున్నారు. అప్పటికీ కేంద్రం స్పందించని పక్షంలో ఈ నెల 25 నుంచి 27 వరకు టోల్ చార్జీల వసూలును కూడా అడ్డుకోనున్నట్లు రైతులు స్పష్టం చేశారు. అయితే తాజాగా కేంద్రం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు నిర్ణయించి.. అనుకూలమైన తేదీని రైతులే నిర్ణయించాలని లేఖలో కోరింది. దీంతో ఇవాళ దీనిపై రైతు సంఘాల నేతలు చర్చించనున్నారు. ఇక రైతుల దీక్షలతో హస్తినకు చేరుకునే రహదారులపై ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles