Actor Sonusood panic on farmers protest రైతులను ఇంకెన్ని రోజులు వీధుల్లో చూడాలి: సోనూసూద్

Will never be able to forget visuals of farmers protest says sonu sood

delhi, Farmer protest, sonu sood, India, Farmers, Supreme Court to form committee to resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

Actor Sonu Sood said he is deeply saddened to see the plight of farmers protesting against the three new agri laws and hoped for a resolution to their issues.

రైతులను ఇంకెన్ని రోజులు వీధుల్లో చూడాలి: సోనూసూద్

Posted: 12/19/2020 06:51 PM IST
Will never be able to forget visuals of farmers protest says sonu sood

(Image source from: Instagram.com/sonu_sood)

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించాడు. రక్తం గడ్డ కట్టే చలిలో వారు రోడ్లపై అందోళన చేస్తున్న విధానం తనను చలింపజేస్తోందన్నాడు. వారి డిమాండ్లను కేంద్రం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వారిని అలా తానే కాదు యావత్ దేశం కూడా చూడలేకపోతోందని వారి పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన.. ఇంకా ఎన్నాళ్లు వారిని ఇలాంటి పరిస్థితుల్లో చూడాలని.. ఇంకా ఎంతమంది రైతులను అసువులు బాయడం చూడాలని ప్రశ్నించాడు.

‘వియ్ ది వుమెన్’ పేరుతో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో చర్చలో పాల్గొన్న సోను రైతుల ఉద్యమంపై స్పందించాడు. రైతుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. వారి దుస్థితి తనను కలచివేస్తోందన్న సోను.. రైతుల విషయంలో తప్పెవరిది? అన్న వాదనకు తాను దిగబోనని, వారి సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన కోరిక అని పేర్కొన్నాడు. తాను పుట్టి పెరిగింది పంజాబ్‌లోనేనని, రైతులతో తనకు చాలా అనుబంధం ఉందని అన్నాడు. ఈ పోరులో కొందరు రైతులు మరణించడం బాధాకరమన్నాడు. ప్రేమగా చెబితే రైతులు వింటారని సోను చెప్పుకొచ్చాడు. పొలాల్లో విత్తనాలు నాటుతూ ఉండాల్సిన రైతులు పిల్లాపాపలతో రోడ్లపైన చలిలో వణుకుతున్నారని, వీరిని ఇలా ఇంకెన్ని రోజులు చూడాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles