Groom killed by friends for refusing to give more liquor పెళ్లి పార్టీలో మద్యం కోసం గొడవ.. పెళ్లికోడుకు హత్య

Groom stabbed to death for not providing more liquor to friends

bridegroom murdered by friends, groom stabbed to death in aligarh, groom stabbed to death in uttar pradesh, groom bablu, alcohol, RamKhilad, Aligarh Groom murdered, Aligarh, liquor, marriage party, Aligarh News, Uttar Pradesh, Crime news

In a shocking incident, a groom was stabbed to death barely hours after his marriage by some of his friends in a village near Aligarh because he refused to provide them more liquor to enjoy the celebrations. Police said the incident took place on Monday night in Palimukim Pur village when the 28-year-old Bablu went to meet his friends soon after his marriage.

పెళ్లి పార్టీలో మద్యం కోసం గొడవ.. పెళ్లికోడుకు హత్య

Posted: 12/17/2020 12:22 PM IST
Groom stabbed to death for not providing more liquor to friends

మద్యం సేవించే అలవాటు వుందా..? వుంటే ఆ అబ్బాయిలను నిర్మోఖమాటంగానే అమ్మాయిలు కాదంటున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో మాత్రం మద్యం అలవాటు లేని అబ్బాయిలే కావాలని అమ్మాయితు తెగేసి చెబుతున్నారు. ఇది పట్టణ, నగర ప్రాంతాలకు మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. మద్యం విషయాన్ని దాచిపెట్టిన అబ్బాయిలు విషయంలో అమ్మాయిలు మరో అడుగు ముందుకేసీ ఏకంగా పెళ్లిపీటల మీద కూడా వరుడ్ని వద్దని.. వారితో పెళ్లికి ససేమిరా అంటూ తెగించి చెబుతున్నారు. మద్యం సేవించిన మనిషి.. తన పంచేంద్రియాలపై సృహ కోల్పోతాడని.. పశువులా ప్రవర్తిస్తాడని వారి నమ్మకం.

వారి నమ్మకాలను సరిగ్గా అలాంటి ఘటనే మరింత బలాన్ని చేకూర్చుతోంది. తన పెళ్లిలో రోజున స్నేహితులు మద్యం కావాలని డిమాండ్ చేయడంతో వారికి రహస్యంగా మద్యాన్ని తెప్పించి పార్టీ ఇచ్చాడు పెళ్లికొడుకు. అదే అతను చేసిన పెద్ద తప్పైంది. అంతేకాదు పెళ్లైన తరువాత చిన్ననాటి స్నేహితులను కలసి వద్దామని అనుకుని వారి వద్దకు వెళ్లడం వరుడు చేసిన మరింత పెద్ద తప్పు. ఆ తప్పే అతడ్ని తిరిగి రాని లోకాలకు తరలివెళ్లేలా చేసింది. చాలినంత మద్యం తెప్పించలేదన్న ఆగ్రహంతో వరుడిపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన యూపీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం పాలిముకిల్ పూర్ కు చెందిన బబ్లూకు సోమవారం రాత్రి వివాహం జరుగగా, ఆపై స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశాడు.

వారంతా విందులో ఉండగా, పలకరించి రావాలని వెళ్లాడు. అప్పటికే పూటుగా తాగివున్న మిత్రబృందం మరింత మద్యం కావాలని అడిగారు. తాగినంత వరకూ చాలని, ఇంకా ఎక్కువగా తాగవద్దని బబ్లూ కోరడంతో వివాదం మొదలైంది. దాంతో విచక్షణ కోల్పోయిన స్నేహితులు బబ్లూపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బబ్లూ తీవ్రంగా గాయపడగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును నమోదు చేసి, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రామ్ ఖిలాడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు ఫ్రెండ్స్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more