pillar falls on pedestrian in Rajasthan's Bharatpur రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై కూలిన పిల్లర్

Watch under construction pillar falls on pedestrian in rajasthan s bharatpur

video under construction pillar falls on man walking on road pedestrian, Rajasthan Bharatpur market area accident, Under-construction pillar falls on pedestrian, video under construction pillar falls on man walking on road, under construction pillar, pedestrian, man walking on road, Seriously Injured, sarafa market area, Bharatpur, Rajasthan, Crime

A person sustained serious injuries after an under-construction pillar in a market in Rajasthan's Bharatpur fell on him while he was passing by from below. The horrific video tweeted by news agency ANI shows two men walking by before getting hit by the collapse. While one man got hit but managed to escape the impact, the other passerby fell on the road after the pillar fell on him.

విధి లిఖితం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై కూలిన పిల్లర్

Posted: 12/17/2020 11:39 AM IST
Watch under construction pillar falls on pedestrian in rajasthan s bharatpur

పెద్దల మాట సద్దన్న మూట అంటారు. అలాంటి పెద్దలే పలు సందర్భాల్లో మనమంతా తొలు బొమ్మలమని, అడించేది మాత్రం పైవాడని, అదే విధి అని అంటుంటారు. ఈ మాటలు విన్నప్పుడు ఇప్పటి జనరేషన్ వారికి అంతా చాదస్తం అనిపిస్తోంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఔరా.! విధి ఎంతటి విచిత్రమైనది. వాహనాలు తిరుగుతున్న రోడ్డుపై ఓ పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి మాత్రమే ఇలాంటి దుర్ఘటన ఎలా ఎదురైందన్న ప్రశ్నలు వినిపించక మానవు. ఇదే విధి అని అనిపించక తప్పదు. రోడ్డు పక్కనే నిర్మితమవుతున్న ఓ భవనంలో పై నుంచి ఓ పిల్లర్ ఉన్నట్టుండి కూలడం.. అది సరాసరి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడటం విధి కాకపోతే మరేంటీ.

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ పట్టణంలో జరిగిందీ దుర్ఘటన. వివరాల్లోకి వెళ్తే.. భరత్ పూర్ లోని సరఫా మార్కెట్ ప్రాంతంలో ఓ రోడ్డు పక్కనే ఓ భవనం నిర్మితం అవుతోంది. దాని ఎదురుగా వున్న రోడ్డు పక్కనుంచి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతే అకస్మాత్తుగా ఆ భవనం మూడో అంతస్థు నుంచి ఓ పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోయి వారిపై పడిపోయింది. ఆ ఇద్దరిలో ఒకరి తలపై అది నేరుగా పడడంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై లేవలేని స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడితో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అయితే తొలుత ఓ ఇటుక అతని వీవుపై తాకడంతో ఆయన ముందుకు పరుగెత్తాడు. దీంతో అతనికి కుడి చేతు, కాలుకి స్వల్పగాయాలయ్యాయి.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. భరత్ పూర్ పోలీసులు రంగంలోకి దిగి.. తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడి పరిస్థితిపై వైద్యులను ఆరా తీసారు. క్షతగాత్రుడు పరిస్థితి నిలకడగా వుందని, అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారని చెప్పారు, రోడ్డు పక్కనున్న ఓ దుకాణంలో నిర్మాణపు పనులు కోనసాగుతున్న తరుణంలో ఓ పిల్లర్ కూలిపోవడంతో ఈ ఘటన సంభవించిందని పోలీసులు తెలిపారు. కాగా  దుకాణ యజమానితో మాట్లాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles