Consider govt's proposal, ready for more talks, Tomar ప్రభుత్వం చర్చలకు రెడీ.. దీక్షలు విరమించండీ: కేంద్రమంత్రి

Consider govts proposal ready for more talks tomar urges protesting farmers

Union Minister Tomar, Narendra Singh Tomar, Farmers protest, Bharatiya Kisan Union, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, Bharatiya Kisan Union, delegation of farmer leaders, Union Home Minister Amit Shah, Amit Shah farmer meeting, All India Kisan Sabha

The Agriculture Minister said that the govt kept waiting for suggestions from farmers' leaders to address their concerns, but they are stuck on the repeal of laws. 'We clarified, we have the right to make laws on trade and explained it to them. APMC and MSP are not affected by it,' the Union Minister said

ప్రభుత్వం చర్చలకు రెడీ.. దీక్షలు విరమించండీ: కేంద్రమంత్రి తోమర్

Posted: 12/11/2020 11:14 PM IST
Consider govts proposal ready for more talks tomar urges protesting farmers

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని దేశరాజధాని సింఘు, టిక్రీ శివార్లో రైతులు చేస్తున్న నిరసన దీక్షలను తక్షణం నిలిపేసి.. తమతో చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ మరోమారు అన్నదాతలను అభ్యర్థించారు, రక్తం గడ్డకట్టే చలిలో రతన్నలు దీక్షలు చేయడం మంచిదికాదని, వారి కోసం కేంద్రం తీసుకువచ్చిన ప్రతిపాదనలను రైతు సంఘాలు పరిశీలించాలని కోరారు. రైతు సంఘాల అందోళనలతో రాజధానికి చెందిన సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి అవసరాల దృష్ట్యా రైతులు నిరసనలను విరమించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అహంకార పూరిత చర్యలకు వెళ్లడం లేదని, పైగా రైతులతో చర్చలకు సిద్దమని ప్రకటిస్తుందని, ఈ తరుణంలోనూ రైతు సంఘాలు చర్చలకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చర్చల తరువాత చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టంగా చెబుతున్నామన్నారు. చట్టాల్లో అభ్యంతరాలు వుంటే దానికి వారినే పరిష్కారాలు ఇవ్వాల్సిందా కూడా కోరామని అయినా రైతులు ముందుకు రాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు తమ అందోళనలను విరమించుకుని వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్దంగా వుందని తోమర్ తెలిపారు.

దేశ రైతన్న తనకు అన్యాయం జరుగుతుందని గ్రహించి అందోళన చేపట్టినా.. తమ పంతం నెగ్గాలనే కేంద్రం యోచిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు, ఇవాళ మరోమారు కేంద్రప్రభుత్వంపై దాడి చేసిన ఆయన కేంద్ర సర్కార్, దేశంలోని రైతుల అధాయం బీహార్ లో సగటు రైతు సంపాదనకు ఎక్కువ కాకుండా వుండాలని కోరుకుంటోందని అరోపించారు. దేశంలోని సగటు రైతు ఆదాయంపై ఓ మీడియా సంస్థ చేసిన సర్వేను ఈ సందర్భంగా ఊటంకిస్తూ రైతు సంపన్నుడైతే ఇతరాత్ర వ్యవహారాలపై దృష్టి సారిస్తాడని, అందులో ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాడని ఇది తమ ప్రభుత్వానికి సముచితం కాదని బీజేపి భావిస్తుందని అరోపించాడు.

దేశంలోని ప్రతీ రైతు తమ సగటు ఆదాయం పంజాబ్ రైతుల ఆదాయంతో సమానంగా వుండాలని కోరుకుంటాడని, అయితే అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం మాత్రం రైతులందరీ ఆదాయం బీహార్ రైతుల ఆదాయంతో సమానాంగా ఉండాలని కోరుటుందోని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు, అయితే మీడియా వెలువరించిన నివేదిక ప్రకారం.. దేశంలోని సగటు రైతు వార్షికాదాయం రూ.77,124 గా ఉంది. కాగా, పంజాబ్ రైతులు సాలీనా రూ. 2, 16, 708 సంపాదిస్తుండగా, బీహార్ రైతులు మాత్రం ఏడాది కేవలం 42, 684 రూపాయలను ఆర్జిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ దానిని ఉటంకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

ఇక రైతుల నిరసనలపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారు. కేంద్రం అమల్లోకి తీసుకువస్తున్న నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో నిరసన దీక్షలపై సకాలంలో స్పందించని పక్షంలో అవి దేశరాజధాని ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించే అవవకాశాలు వున్నాయని అన్నారు, వ్యవసాయ బిల్లులపై సకాలంలో నిర్ణయం తీసుకోని పక్షంటో అవి కేంద్రంలోని ప్రభుత్వానికి చేటు చేస్తుందని హితువు పలికారు. దీనిపై కేంద్రం సానుకూల పరిష్కారం ఇవ్వకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందన్నారు. ఇక నిరసనకు దిగిన రైతుల సహనాన్ని పరీక్షించడం కూడా మంచిదికాదని అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లులపై హాడావిడి రీతిలో చర్చ జరిగిందని, విపక్షాలకు అవకాశం కూడా ఇవ్వకుండా బిల్లులను కేంద్రం అమోదించుకున్న ప్రతిఫలమే రైతుల అందోళనని పవార్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles