Farmers' Union moves SC against controversial farm laws భారత్ బంద్ తో దిగివచ్చిన కేంద్రం.. చర్చలకు ఆహ్వానం..

Farmers protest bharatiya kisan union moves sc against controversial farm laws

Supreme Court, Farmers protest, Bharatiya Kisan Union, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, Bharatiya Kisan Union, delegation of farmer leaders, Union Home Minister Amit Shah, Amit Shah farmer meeting, All India Kisan Sabha

The Bharatiya Kisan Union (BKU) Friday moved the Supreme Court challenging the controversial agriculture laws, claiming that these legislations will make farmers 'vulnerable to corporate greed'.

న్యాయపోరాటానికి సిద్దమైన రైతులు.. సుప్రీంకోర్టులో పిటీషన్

Posted: 12/11/2020 10:56 PM IST
Farmers protest bharatiya kisan union moves sc against controversial farm laws

కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన ఓ వైపు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కేంద్రం రైతు వ్యతిరేక చట్టాల అమలుపై న్యాయపోరాటానికి కూడా దిగాయి, ఇదివరకే రైతులకు మద్దతుగా పలువురు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించగా, ఇక తాజా పరిణామాల నేపథ్యంలో రైతులు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (బికేయు) కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టింది. కార్పోరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి రైతుల జీవనాన్ని కూడా దెబ్బతీసేలా వున్న వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పిటీషన్ దాఖలు చేసింది.

కార్పోరేట్లకు అన్ని రంగాలలో తలుపులు తెరిచింది, ఇక తాజాగా వ్యవసాయ రంగంలోనూ వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు కేంద్రం ఈ వ్యవసాయ బిల్లును హడావిడీగా అమోదించిందని పేర్కోన్నారు, ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందన్నారు. వ్యవసాయ రంగంలోకి కార్పోరేట్ సంస్థలు అడుగుపెడితే.. వారి స్వార్థపు అలోచలు, అత్యాశకు పుడమితల్లినే నమ్మకుని జీవిస్తున్న తమ బతుకులు చిధ్రం అవుతాయని రైతులు తమ పిటీషన్లలో పేర్కోన్నారు, కాగా.. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెడుతున్న రైతన్నకు అండగా ప్రజలు నిలుస్తున్నా.. కేంద్రం మాత్రం చర్చలతో కాలయాపన చేస్తూనే తమ డిమాండ్లను అంగీకరించకుండా అడ్డుతగులుతోందన్నారు. తక్షణం కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అప్పటి వరకు తమ నిరసనలు కోనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు తేల్చి చెబుతున్నారు. దేశానికి రైతు వెన్నుముక్క అని చెబుతూనే రైతు వెన్నునే విరిచే ప్రయత్నం జరుగుతోందని, దీనిని యావత్ దేశం ఖండించాల్సిన అవసరం వుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles