గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీపై రమారమవి శతాధిక స్థానాల్లో బీజేపి గట్టిపోటీని ఇస్తోంది. ఇదిలావుండగా 70 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక్యం సంపాదించుకోగా, బీజేపి మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నాలుగు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, యూసుఫ్ గూడ, మెట్టుగూడ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని అందుకుంది, జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అందించింది మాత్రం యూసుఫ్ గూడ ఓటరే. ఈ డివిజన్ నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన బండారి రాజ్ కుమార్ పటేల్ ప్రత్యర్థి బీజేపి అభ్యర్థిపై విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ తరుపు విజయాన్ని అందించారు. ఇక రామచంద్రాపురం డివిజన్ నుంచి అధికార పార్టీ తరుపున బరిలో దిగిన పుష్పానాగేష్ యాదవ్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రామచంద్రాపురం ఎన్నికలలో పుష్పానాగేష్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి ఎం నర్సింగ్ గౌడ్ పై దాదాపు 5700 పైచిలుకు ఓట్లతో విజయాన్ని అందుకున్నారు, ఇక మెట్టుగూడలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాసూరి సునిత విజయాన్ని అందుకున్నారు. ఇక అధికార పార్టీ చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, కొండాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అటు ఓల్డ్ సిటీలో మెహదీపట్నం డివిజన్ తరువాత ఏకంగా 14 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more