Unidentified men cheated gold merchant in ongole పోలీసుల పేరుతో వ్యాపారికి కుచ్చుటోపి: బంగారం బిస్కెట్లతో పరార్..

Unidentified men cheated gold merchant impersonate as police in ongole

police, impersonating as police, thieves, Unidentified thieves, ongole gold theft, gold theft in ongole, gold businessman cheated, gold business, ongole crime, Andhra Pradesh

Impersonating as police unidentified men cheated gold merchant in ongole of prakasham district in Andhra Pradesh and looted about 1 kg gold from him and escaped within seconds.

పోలీసుల పేరుతో వ్యాపారికి కుచ్చుటోపి: బంగారం బిస్కెట్లతో పరార్..

Posted: 12/03/2020 04:26 PM IST
Unidentified men cheated gold merchant impersonate as police in ongole

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో గిరాకీ లేక వ్యాపారాలన్నీ దివాళా దిశగానే సాగుతున్నాయి. ఈ సమయంలోనే కార్తీక మాసంలో జరిగే వివాహాలతోనైనా కాసింత ఉపశమనం లభిస్తుందని బంగారం వర్తకులు ఆశగా దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేస్తుండగా, బరితెగించిన దొంగలు తమ బతుకుదెరువు కోసం వ్యాపారులనే టార్గెట్ గా చేసి నిట్టనిలువునా దోచుకోవడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులమని నమ్మబలికిన పలువురు గుర్తుతెలియని వ్యక్తులు బంగారు వ్యాపారికి కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా కిలో బంగారు బిస్కెట్లు ఆయన నుంచి లాక్కుని ఉడాయించారు.

ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం రేపింది. విషయం ఒంగోలు వర్తక సంఘం ద్వారా పోలీసులకు చేరింది. అయితే తాము ఎవరినీ తనిఖీ చేయలేదని, మరెవరి నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని తెలిపిన పోలీసులు అసలు ఏం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు ఆభరణాలు తయారీ కోసం చెన్నై నుంచి కిలో బంగారు బిస్కెట్లు తీసుకుని జగ్గయ్యపేటకు బయలుదేరాడు. నెల్లూరు వరకు ఓ వాహనంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరాడు. నెల్లూరు నుంచి బయల్ధేరిన బస్సు ఒంగోలు బస్టాండుకు చేరుకున్న తరుణంలో.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాము ఐడీ పార్టీ పోలీసులమని బస్సెక్కారు. 

వ్యాపారిని తనిఖీ చేయాలని చెప్పి కిందికి దింపిన.. ఆయన వద్ద ఉన్న బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. కొంత సమయం అయనను ప్రశ్నలపై ప్రశ్నలు సంధించిన అగంతకులు ఆ తరువాత క్షణాల్లో పరారయ్యారు. పోలీసులని చెప్పిన వ్యక్తులు తన బంగారాన్ని తీసుకుని వెళ్లడంతో విస్తుపోయిన వ్యాపారి నిర్ఘాంథపోయాడు. షాక్ నుంచి తేరుకున్న ఆయన జగయ్యపేటలోని తన వ్యాపారులకు సమాచారం అందించాడు. వారి సహకారంలో ఒంగోలులోని వర్తక సంఘానికి విషయం చేరింది. దీంతో వారు పోలీసులను అశ్రయించారు. ఐతే తాము ఎవరినీ తనిఖీ చేయలేదన్న పోలీసుల సమాధానంలో వ్యాపారి కన్నీళ్లపర్యంతమయ్యాడు, కాగా కేసును సవాల్ గా తీసుకున్నామని త్వరలోనే నిందితులను పట్టకుంటామని డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ వర్తక సంఘానికి హామీ ఇచ్చారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles