GHMC elections: celebrities casted their vote జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

Ghmc elections cine political celebrities casted their vote

ghmc polls, ghmc elections 2020, low voter turnout, polling percentage, GHMC Elections, TRS, Congress, TDP, BJP, Bandi Sanjay, KTR, CM KCR, GHMC Elections, GHMC Election Campaign, Dubbaka Assembly, Greater Hyderabad Elections, BJP, Hyderabad, Telangana, Politics

Polling percentage remained at just about 30% even at 4 p.m., only two hours before the deadline. Meanwhile cinema stars and politicians turned out in large number to cast their vote. The celebrities including Chiranjeevi, Rajendra prasad, Kishan Reddy, KTR, Asaduddin Owaisi, Cyberabad Commissioner sajjanar casted their vote at near by polling stations.

జీహెచ్ఎంసీ ఎన్నికల: ఓటు కోసం కదిలిన సెలబ్రిటీలు.. కదలని సామాన్యులు

Posted: 12/01/2020 08:30 PM IST
Ghmc elections cine political celebrities casted their vote

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో రాజధాని నగరంలోని సిని, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రమారమి నగరంలోని అనే పోలింగ్ బూత్ లలో కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భయాందోళనకు గురైన నగరవాసి.. ఓటు కన్న తమ ప్రాణమే మిన్న అంటూ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే సామాన్యులకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ వారి ప్రజాస్వామ్యాన్ని పరడవిల్లేలా చేయాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై వుందని.. ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగం కావాలని సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. ఉదయం తొమ్మిది గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని తెలుసుకున్న పోలీసులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఓటర్లను తమ భాద్యతను నిర్వర్తించాలని కోరారు.

ఓటరు తీర్పు వెలువరించాల్సిన కీలక ఘట్టానికి ఇవాళ ఉదయం ఏడు గంటలకు తెరలేవగానే ముందుగా రాజకీయ ప్రముఖులు ఓటింగ్ కోసం బయలుదేరారు. ఉదయం మంత్రి కేటీఆర్ బంజారాహీల్స్ నందినగర్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఈ సందర్భంగా ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఓటు వేసిన వారికే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. ఆ వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి ఓటు వేశారు. కాచిగూడలోని దీక్ష మోడల్ స్కూల్ పోలింగ్ బూత్ కేంద్రంలో కిషన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఓటును హక్కుగా కాకుండా బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు, ప్రపంచంలోనే గర్వించదగ్గ ప్రజాస్వామ్యం మనదని, దానిని పరఢవిల్లేలా.. ఈ పండుగ రోజున ఓటరు కదిలి రావాలని చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో చిరంజీవి, తన సతీమణి సురేఖతో పాటుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇక ఫిల్మ్ నగర్ క్లబులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నిర్మాత శ్యామ్ ఫ్రసాద్ రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్ఎస్ చౌహాన్. కుందన్ బాగ్ లోని పోలింగ్ కేంద్రానికి తరలివచ్చిన ఆయన తన ఓటను వేశారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారధి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసమేతంగా బంజారాహీల్స్ రోడ్డు నెంబరు-4లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని, పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఓవైపు ఎన్నికల విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్.. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. రాచకోండ సీపీ మహేశ్ భగవత్ కుందన్ బాగ్ చిన్మయి స్కూల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ పోలిస్ కమీషనర్ అంజన్ కుమార్ అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు నగర పౌరులను ఓటింగ్ కేంద్రాలకు కదలివచ్చి ఓటు హక్కును సద్వినయోగం చేసుకోవాలని కోరారు.

బావితరాల అభివృద్దిని కాంక్షను గుర్తుపెట్టుకుని సరైన నాయకుడినే ఎన్నుకోవాలని టాలీవుడ్ కమేడియన్ అలి కోరారు. సెలవును ఎంజాయ్ చేస్తూ ఇంట్లో కూర్చోకుండా.. తమ బాధ్యతను గుర్తెరిగి తప్పకుండా ఓటు వేయాలని కోరారు, ఎలాంటి అపేక్ష లేకుండా ఓటు వేసినప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు కూడా పోందుతారని అన్నారు. సినీహీరో అక్కినేని నాగార్జున కూడా సతీసమేతంగా తరలివచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన సతీమణి అక్కినేని అమలతో పాటు వచ్చిన ఆయన ఓటు వేసిన తరువాత.. నగర ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

బీజేపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ చిక్కడపల్లి పోలింగ్ స్టేషన్లో క్యూలో నిల్చుని మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రిపురంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటును వేశారు. అజంపురాలో హోం మంత్రి మహమూద్ అలీ తన కుటుంబసభ్యులతో కలసి వచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. సికింద్రాబాద్ కస్తూర్భా గాంధీ కళాశాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుషాయిగూడలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ప్రస్తుత హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రసాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన అస్త్రమని దానిని ప్రతీ ఓటరు తప్పక వినియోగించుకోవాలని సినీ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. ఫిల్మ్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనాకు భయపడుతూ ఓటుకు దూరంగా జరగవద్దని కోరారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని అల్వాల్ వెంకటాపురం 135వ డివిజన్ మహాభోధి పాఠశాలలో ప్రజాగాయకుడు గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాములమ్మ పేరుతో పాపులర్ అయిన సటి విజయశాంతి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అమె కాషాయ మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రానికి రావడంతో అమె బీజేపిలోకి వెళ్తున్నారన్న వార్తలకు ఈ సంకేతం బలాన్నిచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి తన ఓటుహక్కును తార్నక డివిజన్ లో వినియోగించుకున్నారు. వీరితో పాటు యువహీరో నిఖిల్, హీరో రవితేజ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కూడా ఫిల్మ్ నగర్ లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవలే కరోనా బారినపడి చికిత్స చేయించుకున్నా.. కొంత అరోగ్యం మాత్రం బాగాలేదని.. అయినా ఓటును తన బాధ్యతగా భావించి ఓటు వేయడానికి వచ్చానని హీరో రాజశేఖర్ తెలిపారు. ఓటు మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. సినీ దర్శకుడు క్రిష్, మరో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇలా అనేక మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని నగర పౌరులను ఓటింగ్ కేంద్రాలకు కదలిరావాలని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh