BJP MP Old Video goes Viral ahead GHMC Elections నెట్టింట్లో ధర్మపురి అరవింద్ పాత వీడియో వైరల్..

Bjp mp dharmapuri aravind old video goes viral ahead ghmc elections

KCR, KTR, Telangana, BJP, Dharmapuri Aravind, Dharmapuri Aravind news, Old Video, Electric Bills, Dharmapuri Aravind updates, Dharmapuri Aravind latest, Dharmapuri Aravind flexy, Dharmapuri Aravind about KCR, Dharmapuri Aravind about KTR, Dharmapuri Aravind breaking news, Dharmapuri Aravind video, Dharmapuri Aravind about GHMC polls, BJP MP Aravind Fires on KCR and KTR, TRS, CM KCR, GHMC Elections, Minister KTR, KT RamaRao, TRS Government, Hyderabad, Telangana, Politics

BJP MP Dharmapuri Aravind staged an attack on TRS government in June following the three months electricity bills in June. This Video goes viral on net ahead GHMC elections as the BJP activists share the video.

ITEMVIDEOS: నెట్టింట్లో ధర్మపురి అరవింద్ పాత వీడియో వైరల్.. కల్వకుంట్ల ఫ్యామిలీపై ఫైర్

Posted: 11/24/2020 11:00 PM IST
Bjp mp dharmapuri aravind old video goes viral ahead ghmc elections

తెలంగాణ ఉద్యమ నేత నుంచి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని రెండో పర్యాయం అధిరోహించేంత వరకు కూడా తనకు రాష్ట్రంలో తిరుగులేదని భావించిన సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల నుంచి మాత్రమే కొంత వ్యతిరేక, విమర్శనాత్మక స్వరాలు వినిపించాయి, కానీ ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ నేతల కంటే అధికంగా బీజేపి నేతల గళాలు వినబడుతున్నాయి, వారిలో నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ పేరు చెబితేనే ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు నిమ్మకుండిపోతున్నారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో పాటుగా ఏకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కరోనా లాక్ డౌన్ తరువాత అన్ లాక్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్ మాసంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను నెలవారీ స్లాబులతో పాటు కాకుండా మూడు నెలల మొత్తం యూనిట్లకు కలసి బిల్లులను విద్యుత్ శాఖ జారీ చేయడంతో ఇది అన్యాయమని బిల్లులను చేతబట్టి ఆయన నడిరోడ్డుపై బైఠాయించి తమ నిరసను వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆయన ఏకంగా ముఖ్యమంత్రి ఫ్యామిలీపై హోల్ సేల్ గా తింటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు అంటూ అందర్నీ విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలను అందుకున్న కేసీఆర్ కు తన కుటుంబంమే తప్ప రాష్ట్ర ప్రజలు కష్టనష్టాలు పట్టడం లేదంటూ విరుచుకుపడ్డారు.

కరోనా కారణంగా లాక్ డౌన్ తో రాష్ట్రంంలోని ప్రజలు తమ ఉపాధి, ఉద్యోగాలు పోయాయని బాధపడుతున్న సమయంలో వారికి అండగా నిలిచి అదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిపైనే అదనపు విద్యుత్ బారాలను వేస్తోందని ధ్వజమెత్తారు. కాగా, ఆ వీడియో తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపి శ్రేణులు, పార్టీ కార్యకర్తలు అరవింద్ కు సంబంధించిన పాత వీడియోను షేర్ చేసుకోవడంతో నెట్టింట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే అరవింద్ ప్రశ్నలకు కూడా కౌంటర్లు పడుతున్నాయి, అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. అన్ లాక్ నేపథ్యంలో రోజువారీగా ఇంధన ధరలపై ఎక్సైజ్ పన్నును పెంచుతూ లీటరు ధర ఎనబై ఐదు రూపాయలకు చేర్చింది కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం కాదా.. అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles