Survey reports gives BJP big boast ఉత్కంఠకరంగా బల్దియా పోరు.. ఆశ్చర్యపరుస్తున్న సర్వేలు..

Ghmc elections 2020 opinion poll will bjp create history in hyderabad

GHMC Elections 2020, Opinion Poll Survey, Survey Analysis, GHMC election, Chanakya, Saaraansh Data Strategies, Crowdwisdom360, BJP, Congress, TRS, MIM, Others, Hyderabad, Telangana, Politics

The Greater Hyderabad Municipal Corporation (GHMC) election has been scheduled on December 1st, 2020. The election has been challenged in court and it needs to be seen if the election is delayed. The short notice gives little time for many of the opposition parties to prepare well for the election

ఉత్కంఠకరంగా బల్దియా పోరు.. ఆశ్చర్యపరుస్తున్న సర్వేలు..

Posted: 11/24/2020 11:24 PM IST
Ghmc elections 2020 opinion poll will bjp create history in hyderabad

ప్రత్యేక రాష్ట్ర కాంక్షను సుసాధ్యం చేసిన ఉద్యమనేత తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వున్న బలమైన ఇమేజే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షలా ఉందన్నది కాదనలేని వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి పీఠంపై దళితుడ్ని కూర్చోబెడతానని తాను చేసిన ప్రచారానికి ఆయన కట్టుబడకపోయినా.. తెలంగాణ రైతంగానికి రెండు విడతల చోప్పున సాయం అందించడంతో ఆయనకు మరోమారు రాష్ట్ర ప్రజలు పగ్గాలను అందించారు. కానీ రెండో పర్యాయం ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రభుత్వ ఇమేజ్ కు క్రమంగా డ్యామేజ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపి నాలుగు స్థానాలు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపోందడంతోనే టీఆర్ఎస్ ప్రతిష్టకు బీటాలు వారాయి.

ఇక టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా వున్న దుబ్బాక నియోజకవర్గంలో కాషాయ జెండాను రెపరెలాడించడంతో బీజేపి మరింత బలం చేకూరింది. ఈ తరుణంలో టీఆర్ఎప్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు పూనుకుంది. దుబ్బాక విజయంతో బీజేపి వేళ్లూనుకునే ప్రయత్నాలను ప్రారంభిస్తుందని భావించి జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్ధిష్ట గడవు కన్నా రెండు నెలల ముందుగానే ఎన్నికలను తెరలేపింది. అయితే అసలే మంచి దూకుడు మీదనున్న బీజేపి మాత్రం టీఆర్ఎస్ కన్నా వేగంగా ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. రాష్ట్రస్థాయి నాయకుల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు అందరినీ రంగంలోకి దింపి గెలుపును అందుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. అయితే నిజంగా జాతీయ స్థాయి నాయకులు, అగ్రనేతలు, దిగ్గజాలు దిగినంత మాత్రన గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపికి విజయం వరిస్తోందా.. అంటే ఔననక తప్పదు అంటున్నాయి తాజా సర్వెలు.

నిజంగా ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రజ పల్స్ కమలం పువ్వు వైపు మొగ్గుచూపుతోందా.? అంటే తాజాగా నిర్వహించిన సర్వేలలో అదే అంచనాలు ప్రస్పుటిస్తున్నాయి, ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికలలో పూర్తి మెజారిటీ వుంది. టీఆర్ఎస్ పార్టీకి 99 స్థానాలు, ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు, బీజేపికి నాలుగు, టీడీపీకి 2, కాంగ్రెస్ 2, మరో ముగ్గురు స్వతంత్ర్య సభ్యులున్న జీహెచ్ఎంసీలో ఏ పార్టీ ఎన్ని స్థానలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, చాణక్య, సారంశ డేటా స్ట్రాటజీస్ సంస్థలు నిర్వహించిన సర్వేలలో వచ్చిన అంచనాలు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి, నిజంగా హైదరాబాద్ ప్రజలు బీజేపిని కోరుకుంటున్నారని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్రేటర్ పరిధిలో నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 36 వేల మంది ప్రజలను సారంశ్ డేటా స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేయగా, గ్రేటర్ పరిధిలోని 38.9శాతం మంది బీజేపికే పగ్గాలను అందించాలని కోరుకుంటున్నారని.. దీంతో గ్రేటర్ ఎన్నికలలో బీజేపికి ఏకంగా 84 నుంచి 88 స్థానాలు కైవసం చేసుకోవచ్చునని అంచనా వేసింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి 31.5 శాతం మంది ప్రజలు అనుకూలంగా వున్నారని ఫలితంగా ఆ పార్టీకి 35-39 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. ఇక పాతబస్తీలోని మజ్లిస్ పార్టీకి 11.5శాతం ఓట్లతో 25-30 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి 6.7శాతం ఓట్లతో 4-7 స్థానాలు, టీడీపీకి 2.1 శాతం ఓట్లతో 2-3 స్థానాలు, కాగా, 9.3 శాతం ఓట్లతో 0-2 స్థానాల్లో స్వత్రంత్రులు విజయం సాధించవచ్చునని అంచనా వేసింది. ఈ అంచనాలను ఈ నెల 19 నుంచి 23 మధ్య సేకరించినవని తెలిపింది.

ఇక ఇదే సమయంలో చాణక్య నిర్వహించిన సర్వేలోనూ అదే తరహాలో అంచనాలు వ్యక్తమయ్యాయి, బీజేపికి 46.2 శాతం ఓట్లతో 90 - 96 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. రెండో స్థానంలో మజ్లిస్ 19.1శాతం ఓట్లతో 30-35 స్థానాలు కైవసం చేసుకుంటుందని, ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ 16.9 శాతం ఓట్లతో 24-29 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనాలు తెలిపాయి, ఇక కాంగ్రెస్ పార్టీ 10.7శాతం ఓట్లతో 4 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవచ్చునని.. ఇతరులు 7.1 శాతం ఓట్లతో 3- 5 స్థానాల్లో విజయం సాధించవచ్చేనని చాణక్య సర్వే అంచనా వేసింది.

ఇక క్రౌడ్ విస్ డమ్ 360 నివేదిక ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 37 - 41శాతం ఓట్లు, బీజేపికి 23 - 27 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 9-12 శాతం కోట్లు, ఎంఐఎం పార్టీకి 13 - 15 శాతం ఓట్లు ఇతరులు 6-9శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక సవ్యసాచి సంస్థ చేసిన సర్వే నివేదిక ప్రకారం టీఆరఎష్ పార్టీకి 50- 60 స్థానాలు, బీజేపికి 42-50 స్థానాలు, ఎంఐఎం పార్టీకి 35- 43 స్థానాలు, ఇతరులు 6-13 స్థానాలు కైవసం చేసుకోనున్నాయని వెల్లడించింది, దుబ్బాక అందించిన విజయగర్వంతో జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ తమ సత్తాను చాటేందుకు రెడీ అవుతోంది బీజేపి.. గ్రేటర్ బల్దియాపై కషాయ జెండాను ఎగురవేస్తోందా.? లేదా.? అన్నది తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh