(Image source from: Twitter.com/TrsHarishNews)
కేంద్రం ఇస్తున్న నిధులతో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తమ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు బేష్ అంటూ కేంద్రమంత్రులతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనియాడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన తరువాతే కేంద్ర ప్రభుత్వం రైతుబంధు పధకాన్ని కూడా అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణలో అమలుపరుస్తున్న పథకాలను పలు బీజేపి పాలిత రాష్ట్రాలు కూడా అమలుపర్చేందుకు ముందుకొచ్చిన విషయంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలను ఒక కేస్ స్టడీగా అధ్యయనం చేసేందుకు ఆసక్తిచూపిన విషయాలను ఆయన గుర్తుచేశారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తాము సంక్షేమ పథకాలను అమలుపరుస్తుంటే.. వాటిని నిధులు ఇస్తున్నామంటూ బీజేపి పెద్దలు తప్పడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని విధంగా లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం చేస్తోందని ఆయన అన్నారు.
కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయమై తాను బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ తో బహిరంగ చర్చకు సిద్దమని.. ఆందుకు సమ్మతమైతే తేదీని కూడా ప్రకటిద్దామని ఆయన సవాల్ విసిరారు. 'మీరు దుబ్బాకకు వస్తారా? లేక నన్ను కరీంనగర్ కు రమ్మంటారా?' అని ఛాలెంజ్ చేశారు. అవినీతికి తాము వ్యతిరేకమంటూ ఓ వైపు ప్రచారం చేసుకుంటూనే మరోవైపు సిద్ధిపేటలో రెడ్ హ్యాండెడ్ గా అక్రమ డబ్బుతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలు... తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఎన్నికలలో లబ్దిపొందాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
సిద్దిపేటలోని బీజేపి అభ్యర్థి రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోతే దుబ్బాకలో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి అరగంటలోనే సిద్దిపేట ఎందుకు వచ్చారో చెప్పాలని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే తెచ్చారని ఆయన మామే చెప్పిడంతో బీజేపీ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందని ఎద్దేవా చేశారు. చొక్కాలు చింపుకున్న బీజేపి నేతలు టీఆర్ఎస్ వాళ్లే చింపారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఈ విషయాన్ని ఓటర్లు గ్రహించాలని ఆయన కోరారు.
నిరుద్యోగ సమస్యను కూడా బీజేపి ప్రస్తుతం పెద్దదిగా చేసి చూపుతోందని.. అయితే ఈ సమస్య కేవలం తెలంగాణాకు మాత్రమే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా వుందని ఆయన అన్నారు. ఇదేదో తెలంగాణలో మాత్రమే నెలకొన్న సమస్యగా అభివర్ణించడం సముచితం కాదని అన్నారు, బీజేపి పాలిస్తున్న రాష్ట్రాల్లోనే 17 శాతానికి మించి నిరుద్యోగిత ఉందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్టు వున్నారని ఎద్దేవా చేశారు. ఏటా కోటి ఉద్యోగాలిస్తామన్న మోదీ సర్కారు నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలనే తొలగించిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more