Pakistan to recall envoy, with no ambassador in France రాయబారిని వెనక్కి రప్పించాలని పాక్ తీర్మానం.. బహుచిత్రం.!

Pakistan parliament passes resolution to recall envoy but has no ambassador in france

Pakistan, anti-France protests, French President Emmanuel Macron, Prophet Mohammad cartoons, Pakistan Parliament, Moin-ul-Haq

Amid the anti-France protests in response to French President Emmanuel Macron's remarks about cartoons of the Prophet Mohammad, Pakistan's Parliament on Monday passed a resolution urging the government to recall its envoy from Paris. However, Pakistan has no ambassador posted in Paris currently as its previous envoy Moin-ul-Haq left France three months ago when he was transferred and posted as ambassador to China

రాయబారిని వెనక్కి రప్పించాలని పాక్ తీర్మానం.. ఇదెలా సాధ్యం..

Posted: 10/28/2020 08:12 PM IST
Pakistan parliament passes resolution to recall envoy but has no ambassador in france

(Image source from: Livehindustan.com)

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉంది పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు. యావత్ ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని చాటాలనుకునే పాకిస్థాన్.. తమ చర్యలతో నవ్వులపాలు అవుతోంది. ఈ సారి అలాంటి పనితోనే ప్రపంచ దేశాల ఎదుట మరోమారు నవ్వులపాలైంది. తమ దేశ రాయబారి లేని దేశం నుంచి ఎలా దౌత్యాధికారిని వెనక్కి రప్పిస్తారో మేుము చూస్తామని ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి, ఇదెలా సాధ్యమని మరిన్ని దేశాలు కూడా పాకిస్థాన్ చేసిన తీర్మానం బహుచిత్రమని చర్చించుకుంటున్నాయి.

తమ దేశానికి చెందిన రాయభారులు ఏయే దేశాల్లో వున్నారో.. ఏయే దేశాల్లో లేరో అన్న విషయాలను కూడా తెలుసుకోకుండా ఏకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మాణాలు చేస్తుంటే దేశ విదేశాంగ వ్వవహారాల శాఖ ఏం చేస్తోందోనన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఫ్రాన్స్ నుంచి తమ దేశ రాయభారిని వెనక్కి పిలవాలంటూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది. శక్తి కోలది కష్టపడితే ఇసుక నుంచి తైలం పిండవచ్చునేమో కానీ.. లేని రాయభారిని ఎలా రప్పిస్తారంటూ పలు దేశాలు వ్యంగోక్తులు కూడా విసురుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. మహ్మద్ ప్రవక్త కార్టూన్ల ప్రచురణను సమర్థించడం ద్వారా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై దాడి చేశారన్న పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆ దేశానికి వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మాక్రాన్ వ్యాఖ్యలకు నిరసనగా ఫ్రాన్స్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలవాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఫ్రాన్స్‌లో తమ రాయబారే లేరన్న విషయాన్ని చట్ట సభ్యులు గాలికి వదిలేసారు. ఈ విషయం తెలిసినా ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles