Coal scam: Ex-Minister Dilip Ray awarded 3-year jail termయ కేంద్ర మాజీ మంత్రి దిలిప్ రేకు మూడేళ్ల జైలు

Ex minister dilip ray granted bail after convicted for 3 years jail in coal scam

atal bijari vajpayee, dilip ray, dilip ray coal case, Castron Mining Limited, Jharkhand former CM Madhu Koda, HC Gupta, Mahendra Kumar Agarwalla, NDA, coalgate, coal scam, Mahendra Kumar Agarwalla, Delhi special CBI Court, Bail, Brahmadiha coal mine, Jharkhand, Crime

A Special Court sentenced former Union Minister Dilip Ray and three other individual convicts to three years of jail term for irregularities in the allocation of Brahmadiha coal block in Jharkhand in 1999. Mr. Ray, who was Minister of State for Coal in the Atal Bihari Vajpayee government, was later granted bail on furnishing a bond of ₹1 lakh.

బొగ్గు కుంభకోణంశ వాజ్ పాయ్ క్యాబినేట్ లోని మంత్రికి మూడేళ్ల జైలు

Posted: 10/26/2020 09:45 PM IST
Ex minister dilip ray granted bail after convicted for 3 years jail in coal scam

(Image source from: Outlookindia.com)

బొగ్గు గనుల కేటాయింపు కేసులో పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ఢిల్లీ రౌస్‌ అవెన్యూలోని ప్రత్యేక సీబిఐ న్యాయస్థానం ఇవాళ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల్లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌ రేకు సీబిఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో పాటు దోషులందరికీ రూ. 10లక్షల జరిమాను కూడా విధించింది. ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరు దోషులకు కూడా అదే శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో అక్టోబర్ 6నే తీర్పును వెలువరించిన కేంద్ర మాజీ మంత్రితో పాటుగా మరో ముగ్గురిని కూడా దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ ఈ నలుగురికీ శిక్షలను ఖరారు చేసింది. మూడేళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.

అయితే ఇలా శిక్షలు ఖరారైన మరోకిద్ది సేపట్లో దోషులకు అదే న్యాయస్థానం బెయిలును కూడా మంజూరు చేసింది. దోషులుగా తేలిన నలుగురికి లక్ష రూపాయల బాండ్ పూచికత్తుతో న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. తమ తీర్పుపై దోషులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా నవంబర్ 25 వరకు గడవును ఇచ్చింది. 1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో దిలీప్‌ రే బొగ్గు గనులశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన దిలీప్‌ రేతో పాటు అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు ప్రదీప్‌ కుమార్‌ బెనర్జీ, నిత్యానంద్‌ గౌతమ్‌, క్యాస్ట్రన్‌ టెక్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మహేంద్ర కుమార్‌ అగర్వాల్ ను దోషిగా తేల్చింది.

ఇవాళ దోషులందరికీ శిక్షను ఖరారు చేసిన న్యాయస్థానం.. రూ. లక్ష పూచికత్తుతో బెయిలు మంజూరు చేసింది. కాగా అక్రమ కేటాయింపులతో లాభాన్ని పోందిన క్యాస్ట్రన్‌ టెక్‌కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా వేసింది. ఇక ఇదే బోగ్గు గనుల అక్రమ కేటాయింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు రూ.25 లక్షల అపరాధ రుసుము విధించిన న్యాయస్థానం ఆయనకు కూడా మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఇక మధుకోడాతో పాటు కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శిగా వ్యవహరించిన హెచ్ సి గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atal bijari vajpayee  dilip ray  Madhu koda  HC Gupta  Mahendra kumar Agarwalla  coalgate  Jharkhand  Crime  

Other Articles