SC Rejects OBC Quota Plea In Medical Colleges వైద్య కళాశాలల్లో 'నో' ఓబిసీ కోటా.. తమిళ ప్రభుత్వ అభ్యర్థనకు 'చెల్లు'

Sc declines interim relief for obc quota in aiq seats in tn medical colleges

NEET AIQ, NEET exam, neet 2020, neet counselling, neet news, supreme court, supreme court on neet, neet supreme court, neet medical seats, neet tamil nadu, tamil nadu neet, tamil nadu neet seats, neet obc quota, neet obc quota seats

The Supreme Court on Monday declined to order the interim relief of implementing 50% reservation this year itself for NEET-UG students belonging to Other Backward Classes (OBCs) in medical and dental seats contributed to the All India Quota (AIQ) by State government-run colleges in Tamil Nadu.

వైద్య కళాశాలల్లో ‘నో’ ఓబిసీ కోటా.. తమిళ ప్రభుత్వ అభ్యర్థనకు ‘చెల్లు’

Posted: 10/26/2020 09:59 PM IST
Sc declines interim relief for obc quota in aiq seats in tn medical colleges

వైద్య కళాశాలల్లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 50శాతం కోటా కింద సీట్ల కేటాయింపును ఈ వార్షిక సంవత్సరంలోనే కల్పించాలన్న అభ్యర్థనను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్‌ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో యాభై శాతం ఓబీసీలకు కేటాయించాలని తమిళనాడు అధికార పార్టీ ఎఐఏడిఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటీషన్లతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టును ఆశ్రయించాయి, ఈ పిటీషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.

వైద్య కళాశాలల్లోని పోస్టు గ్రాడ్యూయేట్, ఎంబిబిఎస్, డెంటల్ కోర్సులకు చెందిన సీట్లలో 50శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో ఈ రెండు పార్టీలూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటీషన్లను జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రాస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, విద్యార్థులు జనవరి - ఫిబ్రవరి మాసాల్లో దరఖాస్తులు నింపినందున వారికి ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించడం ఈ ఏడాది సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. జులై నెలలో ఇదే విషయమై దాఖలైన పిటీషన్లను మద్రాసు హైకోర్టు కూడా విచారించింది.

కేంద్ర నిర్వహణలో లేని విద్యా సంస్థల్లో ఆల్‌ ఇండియా కోటా కింద వెనకబడిన తరుగతులకు చెందిన విద్యార్థులకు 50శాతం రిజర్వేషన్ల పరిశీలనకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, తమిళనాడు ఆరోగ్యశాఖ, అఖిలభారత వైద్య మండలితో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో కమిటీ నియమించి రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కాగా కమిటీ వెలువరించే నిర్ణయాలు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అయితే, మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈ విద్యా సంవత్సరంలోనే 50శాతం కోటా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయా పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NEET  TN medical colleges  OBC quota  TN 69% reservation  Supreme Court  

Other Articles