Telugu states to witness rain for 2 days అలర్ట్: మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాలకు వర్షసూచన

Weather forecast alert in andhra pradesh after telangana rain forecast for 2 days

Rain logjam, houses drowned with rain water, Uppal TRS MLA, rains in hyderabad, colonies flooded with Rain, MLA Subash Reddy, telangana weather, low pressure, deep depression, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, weather forecast, Telangana, Andhra Pradesh

According to the Meteorological Department, low pressure occured in bay of bengal is likely to intenisfy to deep depression, as the cyclonic circulation has moved from the East Central Bay of Bengal to the places located at the center, which is 5.8 km above sea level.

అలర్ట్: మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాలకు వర్షసూచన

Posted: 10/22/2020 09:18 PM IST
Weather forecast alert in andhra pradesh after telangana rain forecast for 2 days

(Image source from: Thehansindia.com)

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడా.. అన్నట్లుగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే కుండపోతగా కురిసిన వర్షాలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రాజెక్టుల గెట్లు తెరచి.. వందల టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరుణుడి మునుప్పెన్నడూ లేని విధంగా వర్షాకాలం ఆరంభంతో జూన్ మాసం నుంచి రాష్ట్ర ప్రజలపై ప్రేమ కురిపించడంతో తెలుగురాష్ట్రాలలోని వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, జలకళను సంతరించుకున్నాయి. సెప్టెంబర్ మాసంలోనూ ప్రారంభంలో వర్షంతో తెలుగు రాష్ట్రాలను తడిసి ముద్దేచేసిన వరుణుడు.. కాసింత గ్యాప్ ఇచ్చి అక్టోబర్ మాసంలోనూ దంచికోడుతుండటం వల్ల వర్షం ధాటికి తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి,

మరీ ముఖ్యంగా చెరువులు, కుంటలను, నాలాలను అక్రమించి ఇళ్లు, అపార్టుమెంటులు కడుతూ నగరాన్ని విస్తరించుకుంటూ వెళ్లిన నగరవాసిపై మాత్రం వరుణుడు పగబట్టాడు. ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో వర్షం కురసిన నేపథ్యంలో  నాలాలపై కట్టిన నిర్మాణాలను కూల్చివేసి.. వాటిని పరిరక్షిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదేళ్లు గడిచినా.. నాలాల ఆక్రమణలను తొలగించడంలో విఫలం కావడంతో నగరం మునకేసింది. నగరజీవి బతుకు స్థంభించిపోయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగి జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. వరుసగా మూడు రోజులు పాటు కురిసన వర్షాలకు నగరవాసి బతుకుబండీ ఆగమయ్యింది. ప్రభుత్వాలు సహకరిస్తాయని ఆశించినా ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి.

ఇక ఇప్పటికీ వరద నీటితో ఇంట్లోకి వచ్చిన బురద, నీరు భయటకు వెళ్లే మార్గం లేకపోడంతో.. పలు ప్రాంతాల్లో వాటితోనే బతుకు బండిని లాగిస్తున్నవారికి తాజాగా భారత వాతావరణ శాఖ మరో చేధువార్తను చెప్పింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తోందని, రానున్న రెండు రోజుల్లో ఇది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం వుందని తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కోనసాగుతూ వుందని తెలిపారు.

అల్పపీడన, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణా, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ గ్రామీణ ప్రాంతలంలో పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు అత్యైక పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles