'Can't Add More Relief': Centre To Top Court On Moratorium ఆర్నేళ్లకు మించి పొడగించడం సాధ్యం కాదు: మారటోరియంపై కేంద్రం

Cant extend loan moratorium period may affect credit creation in economy rbi to supreme court

Reserve Bank of India, loan moratorium, RBI affidavit, finance ministry

Reserve Bank of India (RBI) has said that it is not possible to give more relief to sector affected by the coronavirus pandemic. The banking regulator has also said that it is not possible to extend the moratorium period beyond six months.

ఆర్నేళ్లకు మించి పొడగించడం సాధ్యం కాదు: మారటోరియంపై కేంద్రం

Posted: 10/10/2020 09:22 PM IST
Cant extend loan moratorium period may affect credit creation in economy rbi to supreme court

కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మారటోరియం కాలనికి వడ్డీపై వడ్డీ వేస్తోందని దాఖలైన పిటీషన్లను విచారించిన న్యాయస్థానం.. దేశంలో లాక్ డౌన్ ను కేంద్రమే విధించింది.. కాబట్టి మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీని కూడా మినహాయించాల్సింది కేంద్ర ప్రభుత్వమే గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు పలు విషయాలు తెలిపింది. రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ఆర్బీఐ దాఖలు చేసిన అవిడవిట్ లో పేర్కొంది. కరోనా వల్ల నష్టపోయిన  ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది. వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా కేంద్ర సర్కారు స్పష్టతనిచ్చింది.

నిర్దిష్ట రంగ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి న్యాయస్థానం వెళ్లకూడని కేంద్ర సర్కారు, ఆర్బీఐ తెలిపాయి. మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని పేర్కొంది. దీంతో ఆయా రంగాల ఇబ్బందులను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve Bank of India  loan moratorium  RBI affidavit  finance ministry  

Other Articles