Not vindictive in TRP scam bust: Sanjay Raut టీఆర్పీ స్కామ్ ఆరంభమే.. త్వరలో మరిన్ని వెలుగులోకి: సంజయ్ రౌత్

No vindictive action by mumbai cops in busting trp scam sanjay raut

Mumbai Police, Sanjay Raut, TRP, TRP Ratings, news channels, Republic TV, Fakt Marathi, Box Cinema, BARC, Kangana Ranaut, Maharashtra, Politics

Sanjay Raut, Shiv Sena leader on Friday October 10 rubbished allegations of Mumbai police acting in a vindicative manner in busting the Television Rating Points (TRP) manipulation racket. Raut told reporters, 'Mumbai police took a courageous step to unravel this scam. This is just the beginning...everything will be unravelled soon.'

టీఆర్పీ స్కామ్ ఆరంభం మాత్రమే.. త్వరలో మరిన్ని వెలుగులోకి: సంజయ్ రౌత్

Posted: 10/10/2020 08:49 PM IST
No vindictive action by mumbai cops in busting trp scam sanjay raut

అక్రమ మార్గాల ద్వారా తమ టీవీ వీక్షకుల సంఖ్యను పెంచుకుని టీఆర్పీ రేటింగ్ లపై ప్రభావితం చేసిన టీవీ ఛానెల్ల గుట్టును బయటపడటం కేవలం అరంభం మాత్రమేనని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు, టీఆర్పీ రేటింగ్ కోసం పలు ఛానెళ్లు మోసాలకు పాల్పడ్డాయని.. తమ టీవీ చానెళ్లలో వ్యాపార ప్రకటనలను భారీగా పెంచుకోవడంతో పాటు టారిఫ్ రేట్లు కూడా భారీగా వడ్డించేందుకు అక్రమ మార్గాలలో పయనించాయని ముంబై పోలీసులు వెలికితీసిన విషయపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణంలో జాతీయ ఆంగ్ల ఛానెల్ రిపబ్లిక్ టివీతో పాటు మరో రెండు మరాఠి చానెళ్లు కూడా వున్నాయని అన్నారు,

వార్తలను అందిస్తూ, డిబేట్ లను యావత్ దేశ ప్రజలు చూస్తున్నారని.. ప్రతీ అంశాన్ని దేశం తెలుసుకోవాలని భావిస్తుందని.. ప్రశ్నించే న్యూస్ ఛానెల్ సహా మరాఠీ చానెళ్లు అక్రమ మార్గాల్లో తమ టీఆర్పీ రేటింగ్ లను పెంచుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన నిలదీశారు. అడ్డదారిలో అందలం ఎక్కాలని, వాణిజ్య ప్రకటనదారులను మోసం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని కూడా దేశం తెలుసుకోవాలని భావిస్తోందని ప్రశ్నించారు, రూ.30 వేల కోట్ల విలువైన భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ముంబయి పోలీసుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.

ముంబై పోలీసులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని, అయితే, ఈ వ్యవహారంలో ముంబయి పోలీసులు కక్షసాధింపు, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ముంబయి పోలీసుల ప్రొఫెషనలిజాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. మహావికాస్ అగాఢీ సర్కారును అస్థిరపరిచేందుకు, ఉద్ధవ్ థాకరే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు ప్రతీకార ధోరణి కాదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. టీఆర్పీ రేటింగ్ కుంభకోణం ఆరంభం మాత్రమేనని, మరికొన్నిరోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేందకు చేసే ప్రయత్నాలన్నీ కూడా మొత్తంగా బయటికి వస్తాయని రౌత్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles